ఇంటికి పోదాం చలో చలో
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు మంగళవారంతో ముగియడంతో విద్యార్థులు ఇంటి బాటపట్టారు. ఈనెల 3న ప్రారంభమైన పరీక్షలు మంగళవారం వరకు కొనసాగాయి. చివరి రోజు కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు జరిగాయి. ప్రథమ సంవత్సరం పరీక్షలు ముగియడంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు. సెలవులు కాగానే మళ్లీ కలుద్దాం అంటూ బయలుదేరారు. విద్యార్థులతో నగర బస్టాండ్ సందడిగా మారింది.
-నిజామాబాద్‌అర్బన్/సాక్షి ఫొటోగ్రాఫర్, నిజామాబాద్