ఒకటి, ఒకటి, రెండు, రెండు.. ‘చై-నా’ ర్యాంకులు కాదు.. జగనన్న ఆణిముత్యాలు | Ability of government students in tenth exams | Sakshi
Sakshi News home page

ఒకటి.. ఒకటి.. రెండు.. రెండు.. ‘చై-నా’ ర్యాంకులు కాదు.. జగనన్న ఆణిముత్యాలు

Published Sun, May 21 2023 5:13 AM | Last Updated on Sun, May 21 2023 3:00 PM

Ability of government students in tenth exams - Sakshi

ఒకటి.. ఒకటి.. ఒకటి.. రెండు.. రెండు.. రెండు.. అన్నీ చైనా (చైతన్య, నారాయణ) ర్యాంకులు.. అయితే అది ఒకప్పటి మాట. ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థులు సాధించిన ర్యాంకులివి... ఇటీవల ప్రకటించిన పదో తరగతి ఫలితాలలో ప్రభుత్వ స్కూళ్లు విజయదుందుభి మోగించాయి. వాటిలో చదువుతున్న నిరుపేద విద్యార్థులు మునుపెన్నడూ ఎరుగని రీతిలో సత్తా చాటారు... రాష్ట్రప్రభుత్వం తల్లిదండ్రులకు అందిస్తున్న ప్రోత్సాహకాలు.. సంక్షేమ పథకాలు ఒకవైపు.. మౌలిక సదుపాయాలతో సహా స్కూళ్లను సమూలంగా మార్చేస్తున్న నాడు నేడు వంటి కార్యక్రమాలు మరోవైపు.. దారితప్పిన విద్యావ్యవస్థను పట్టాలపైకి ఎక్కించాయి.విద్యార్థులలో పెల్లుబికిన ఉత్సాహం చదువుల విప్లవాన్ని సృష్టించింది. అందుకు పది ఫలితాలు ప్రత్యక్ష నిదర్శనం.. అద్భుతమైన ప్రతిభ చూపించిన ఈ ప్రతిభామూర్తులను ‘జగనన్న ఆణిముత్యాలు’గా ఎంపిక చేసి రాష్ట్ర ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలతో సత్కరించనుంది. వారిలో కొంతమందితో సాక్షి ముచ్చటించింది. వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే...  

ప్రభుత్వ ప్రోత్సాహం బాగుంది.. 
పేరు:మిట్టు మహాపాత్రో   
పాఠశాల: పాతపట్నంప్రభుత్వ స్కూల్‌ శ్రీకాకుళం జిల్లా మాది పేద కుటుంబం. మా నాన్న వాహనాల టైర్లకు పంచర్లు వేస్తుంటారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివాను.  ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రభుత్వ ఒడియా పాఠశాలలోనూ, 6 నుంచి 10వ తరగతి వరకు పాతపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాను. చిన్నతనం నుంచి మా చిన్నాన్న రవి మహాపాత్రో ఎక్కువగా చదువుకోవాలని ప్రోత్సాహం అందించారు.  

♦ రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం బాగుంది. జగనన్న విద్యా కానుక కింద నాకు, అక్కకు పుస్తకాలు, బ్యాగ్, షూ, డ్రస్‌లు అందించారు. 
♦ పదో తరగతిలో 600కు 570 వస్తాయని అనుకున్నాను. 594 మార్కులు వస్తాయని ఊహించలేదు. ప్రశ్నలవారీగా కాకుండా పాఠ్యాంశాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకునేవాడిని. పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా అర్థం చేసుకునేలా పాఠ్యాంశాలను బోధించారు. దీనివల్ల పాఠ్యాంశంలో ఏ ప్రశ్న ఇచ్చినా రాయగలిగాను. సకాలంలో సిలబస్‌ను పూర్తి చేయడంతో రివిజన్‌కు ఎక్కువ సమయం కేటాయించేందుకు అవకాశం ఏర్పడింది. రివిజన్‌లో వెనుకబడిన సబ్జెక్టులకు ఎక్కువ సమయం వెచ్చించాను.  
♦ మంచి మార్కులు రావడం పట్ల సంతోషంగా ఉంది. ట్రిపుల్‌ ఐటీలో చదివి ఇంజనీర్‌ను కావడమే నా లక్ష్యం. 


తొలి రోజే విద్యా కానుక అందింది.. 
పేరు: గోవుల గోకుల కృష్ణారెడ్డి 
పాఠశాల: కేఎన్నార్‌ మున్సిపల్‌ స్కూల్, నెల్లూరు 

పాఠశాల ప్రారంభం రోజే జగనన్న విద్యాకానుక కింద అన్ని పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాం, బూట్లు, తదితర వస్తువులు ఇచ్చారు. అలాగే నాడు – నేడు కింద పాఠశాలలో అన్ని వసతులు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారు. బెంచీలు, బ్లాక్‌బోర్డు, సరిపడా గదులు ఉండటం వల్ల ఎలాంటి అసౌకర్యం కలగలేదు. మినిరల్‌ వాటర్‌తో పాటు నాణ్యమైన భోజనం అందించారు. అమ్మఒడి కింద రూ.15 వేల నగదును ప్రభుత్వం అందించింది.

ఇందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. 593 మార్కులు సాధించడానికి పాఠశాల హెడ్‌మాస్టరు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహించారు.  ప్రతి సబ్జెక్టుకు టైమ్‌ టేబుల్‌ వేసుకుని దాని ప్రకారం చదివాను. సబ్జెక్టులకు వాటి ప్రాధాన్యత ప్రకారం సమయం కేటాయించా. ముందు ఇంటర్‌లో మంచి మార్కులు సాధించడమే నా లక్ష్యం. ఆ తర్వాత బెస్ట్‌ ఐఐటీలో ఇంజనీరింగ్‌ చదువుతా. 

నాడు–నేడుతోఅన్ని వసతులు
పేరు: పి.శ్రీనివాసరావు
పాఠశాల: బీఎన్‌ఆర్‌ మున్సిపల్‌ స్కూల్, గుంటూరు
ఒకటో తరగతి నుంచి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతు­న్నా­ను. అయితే అప్పట్లో పాఠ్యపుస్తకాలు మినహా మాకు ఏమీ ఇవ్వలేదు. అదికూడా స్కూళ్లు తెరిచిన రెండు నెలల కానీ చేతికి ఇచ్చేవారు కారు. పాత కాలం బెంచీలు, బల్లలపై కూర్చోవాల్సి వచ్చేది. అయితే గత నాలుగేళ్లుగా ప్రతి ఏటా జగనన్న విద్యా­కానుక కింద కిట్‌ అందుకున్నాను. పైసా ఖర్చు లేకుండా ఉచి­తంగా చదువు చెప్పడంతో పాటు టెక్ట్స్‌­బుక్స్, యూనిఫామ్, నోట్‌బుక్స్, బ్యాగు, బూట్లు వంటివన్నీ ఉచితంగా ఇచ్చారు.

జగనన్న గోరుముద్దతో నాణ్య­మైన భోజనాన్ని అందించారు.  అధిక మార్కులు తెచ్చుకు­నేం­దుకు జగనన్న విద్యాజ్యోతి స్టడీ మెటీరియల్‌ కూడా ఫ్రీగా ఇచ్చారు. నాడు–నేడు ద్వారా పాఠశాల రూపు­రేఖలను ప్రభుత్వం మార్చేసింది. కూర్చునేందు­కు డ్యూయల్‌ డెస్క్‌లు ఏర్పాటు చేసింది.క్లాస్‌ రూమ్‌లో ఫ్యాన్లు, లైట్లతో ప్రశాంతంగా చదువుకునే వాతావరణాన్ని కల్పించింది. ఎక్కు­వ మార్కులు సాధించడానికి ఈ వసతులు అన్నీ ఉపయో­గ­ప­డ్డాయి. కార్పొరేట్‌ స్కూళ్లతో పోల్చితే ఎక్కడా తగ్గకుండా అన్ని సదుపాయాలు కల్పించారు. మా స్కూ­ల్లో వసతులు కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా ఉన్నాయి. ఇంటర్‌లో 
ఎంపీసీ తీసుకుంటా. ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యం.  

‘కార్పొరేట్‌’లో చదివినఅనుభూతి.. 
పేరు: ఎ.వైష్ణవి 
పాఠశాల: జెడ్పీహెచ్‌ స్కూల్, పొదలకూరు, నెల్లూరు జిల్లా 
ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పాఠశాలలో అన్ని సబ్జెక్టులకు సరిపడా ఉపాధ్యాయులు ఉన్నారు. అలాగే అన్ని సబ్జెక్టులకు క్వాలిఫైడ్‌ టీచర్లు ఉన్నారు. వారు అర్థమయ్యే రీతిలో మెరుగ్గా బోధించారు. నాడు – నేడు కింద మా పాఠశాలలో ప్రభుత్వం అన్ని మౌలిక వసతులు కల్పించింది.

బెంచీలు, ఫ్యాన్లు, లైట్లు, తాగునీరు ఇలా అన్ని  సదుపాయాలు ఉన్నాయి. దీంతో నాకు కార్పొరేట్‌ పాఠశాలలో చదువుతున్న అనుభూతి ఉండేది.పేద విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న అమ్మ ఒడి పథకాలను అందజేస్తోంది. 

ప్రభుత్వ పథకాలే ఆదుకున్నాయి 
పేరు: పేడాడ షణ్ముఖ వికాస్‌ 
పాఠశాల: లక్ష్మీనగర్‌ మున్సిపల్‌ హైసూ్కల్, ఆమదాలవలస, శ్రీకాకుళం జిల్లా జగనన్న విద్యాకానుక కింద నోట్‌ పుస్తకాలు, పాఠ్యపుస్తకాలతోపాటు అమ్మఒడి, మధ్యాహ్న భోజన పథకం వంటివి పేద విద్యార్థినైన నన్ను ఆదుకున్నాయి. దీంతో ఎలాంటి ఒత్తిడి, ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా చదువుకోవడానికి అవకాశం కలిగింది.

నా తల్లిదండ్రుల పైన ఎలాంటి ఆర్థిక భారం పడకపోవడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇందుకు సీఎం వైఎస్‌ జగన్‌కు నా కృతజ్ఞతలు. మా పాఠశాలలో ఉపాధ్యాయులు.. విద్యార్థులతో వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేశారు. సందేహాలు ఉంటే ఆ గ్రూప్‌లో పోస్ట్‌ చేస్తూ సందేహాలు నివృత్తి చేసుకునేవాళ్లం. పాఠశాలలో మొదటి నాలుగు నెలల్లోనే సిలబస్‌ పూర్తి చేశారు. తర్వాత రివిజన్‌ చేస్తూ ప్రతిరోజూ పరీక్షలు నిర్వహించేవారు. 

‘ఆక్స్‌ఫర్డ్‌’తోనే  అధిక మార్కులు
పేరు: సోముల వెంకట రామ శరణ్య 
పాఠశాల: వైవీఎస్‌ మున్సిపల్‌ గర్ల్స్‌ హైస్కూల్, ప్రొద్దుటూరు,వైఎస్సార్‌ జిల్లా 
ప్రభుత్వం జగనన్న విద్యా కానుకలో భాగంగా అందించిన ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ ఎంతగానో ఉపయోగపడింది. దీంతో ఇంగ్లి‹Ù సబ్జెక్టులో వందకు 99 మార్కులు సాధించగలిగాను. నాడు–నేడు కింద ప్రభుత్వం మా పాఠశాలను సమగ్రంగా అభివృద్ధి చేసింది. అలాగే జగనన్న గోరుముద్ద కింద మంచి పౌష్టికాహా­రాన్ని అందించారు.

ప్రభుత్వ పథకా­లతో మా తల్లిదండ్రులపై రూపాయి భారం కూడా పడలేదు. ఉపాధ్యా­యు­లు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినడంతోపాటు తెల్లవారుజామున 2 గంటలు, రాత్రి 2 గంటలు, పాఠశాలలో స్టడీ అవ­ర్స్‌లో బాగా చదివాను. ఇంగ్లి‹Ù, మ్యాథ్స్, సైన్స్‌ సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. ట్రిపుల్‌ ఐటీలో బీటెక్‌ సీఎస్‌ఈ చదువుతా. భవిష్యత్తులో  సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అవుతా.

ప్రభుత్వమేఅన్ని సౌకర్యాలు కల్పిస్తోంది..
పేరు: నాగరాజుగారి ఐశ్వర్య 
పాఠశాల: జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, రొళ్ల, శ్రీసత్యసాయి జిల్లా 
‘అనంత సంకల్పం’ పేరుతో అధికారులు 100 రోజుల ప్రణాళిక అమలు చేశారు. పరీక్షల్లో అధిక మార్కులు సాధించడానికి అధికారులు ప్రత్యేకంగా అందించిన బుక్‌లెట్‌ ఎంతగానో ఉపయోగపడింది. ఇంటి దగ్గర తల్లిదండ్రులు బాగా చదువుకోవాలని ఎంతో ప్రోత్సహించారు. దీంతో 590 మార్కులు సాధించగలిగాను. గతంలో మా పాఠశాలలో అరకొర సౌకర్యాలు ఉండేవి. ఇటీవల ప్రభుత్వం ‘మనబడి నాడు–నేడు’ కింద అన్ని వసతులు కల్పించింది. దీంతో మంచి వాతావరణంలో చదువుకునే అవకాశం ఏర్పడింది.

ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలతో మాలాంటి పేద పిల్లలకు ఎంతో మేలు జరుగుతోంది. ప్రభుత్వ బడుల్లో ఉచితంగా చదువు చెప్పడంతో పాటు పుస్తకాలు కూడా ఇస్తున్నారు. అలాగే జగనన్న విద్యాకానుక కింద స్కూల్‌ బ్యాగు, నోటు పుస్తకాలు, షూ..ఇలా అన్నీ అందిస్తున్నారు. ఇప్పుడు చదువుకోవాలనే తపన ఉంటే చాలు ప్రభుత్వమే అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. ప్రభుత్వ స్కూళ్లలోనే బాగా చెప్పే ఉపాధ్యాయులు ఉన్నారు. 


ప్రభుత్వ బడి బాగుండదని అనుకున్నా  
పేరు: షేక్‌ మహ్మద్‌ సమీర్‌ 
పాఠశాల: మోడల్‌ స్కూల్, అవుకు,నంద్యాల జిల్లా 
మా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులతో నన్ను ఆరో తరగతి నుంచి ఆదర్శ పాఠశాలలో చేరి్పంచారు. అయితే ప్రభుత్వ పాఠశాలలో వసతులు ఉండవేమో, మంచిగా చెప్పరేమోనని ఆందోళనపడ్డాను. అయితే నేను ఊహించినట్టు ప్రభుత్వ పాఠశాలలో పరిస్థితులు లేవు. ప్రభుత్వం నాడు–నేడు కింద మా పాఠశాలలో అన్ని వసతులు కల్పించింది. ప్రభుత్వ చర్యలతో ప్రైవేట్‌ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలే ఎంతో బాగున్నాయి.

ప్రభుత్వం కార్పొరేట్‌ స్థాయిలో నాణ్యమైన పుస్తకాలను, దుస్తులను, షూ, బెల్ట్, టై లాంటివి ఉచితంగా అందించింది. అంతేకాకుండా ప్రతిరోజు మధ్యాహ్నం ఒక మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందజేసింది. అంతేకాకుండా అమ్మఒడి పథకం ద్వారా మా చదువులకు ఉన్న ఆర్థిక ఇబ్బందులను కూడా తొలగించింది.  భవిష్యత్తులో ఐఏఎస్‌ సాధించడమే నా లక్ష్యం. 


ప్రభుత్వ మెటీరియల్‌ బాగుంది 
పేరు: ఎస్‌.హరిణి 
పాఠశాల: ఎస్‌పీసీఎన్‌ మునిసిపల్‌ హైసూ్కల్, ప్రొద్దుటూరు రామేశ్వరం,వైఎస్సార్‌ జిల్లా 
పదో తరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వం డీసీఈబీ మెటీరియల్‌ అందించింది. ఇది మాకు ఎంతో ఉపయోగపడింది. అలాగే ప్రభుత్వం జగనన్న విద్యా కానుకతో అందించిన ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లిష్‌ డిక్షనరీతో ఇంగ్లిష్‌ సబ్జెక్టులో అధిక మార్కులు సాధించగలిగాను. ప్రభుత్వ పథకాలతో ఎంతో లబ్ధి కలిగింది. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మా పాఠశాలలో విద్యాబోధన చేయడం వల్లే 590 మార్కులు వచ్చాయి.

 రోజూ తెల్లవారుజామున 4 నుంచి 6 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10.30 గంటల వరకు చదివాను. స్టడీ టైమ్‌ టేబుల్‌ను అనుసరించడంతోపాటు పాఠ్యాంశాల్లో వచ్చిన సందేహాలను ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులను అడిగి నివృతి చేసుకున్నాను. ప్రతి పాఠ్యాంశాన్ని రివైజ్‌ చేశాను.  ప్రభుత్వ ఆదేశాలతో ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు.  స్టడీ అవర్స్‌ నిర్వహించి పాఠ్యాంశాల్లో పట్టు సాధించేలా శిక్షణ ఇచ్చారు. దీంతో మ్యాథ్స్‌లో 100కు 100 మార్కులు సాధించాను. ట్రిపుల్‌ ఐటీలో చేరి భవిష్యత్తులో ఐఏఎస్‌ కావడమే నా లక్ష్యం.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement