గాడ్జెట్‌లతో గడిపితే మార్కులు అంతంత మాత్రమే
టొరంటో: వీడియో గేమ్స్, ఫోన్లు, టీవీలతో ఎక్కువ సమయం గడిపే టీనేజీ కుర్రాళ్లకు మాథ్స్, ఇంగ్లిష్‌లలో తక్కువ మార్కులు వస్తాయని తాజా పరిశోధనలో తేలింది. ఎక్కువ సమయం వివిధ గాడ్జెట్లతో గడపడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుందని యూనివర్సిటీ ఆఫ్ టొరంటోకు చెందిన పరిశోధకుడు అమి ఫీన్ తెలిపారు. ఒకై వైపు టీవీ చూస్తూ ఫోన్ వాడడం లాంటి పనులు ఒకేసారి చేయడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుందని ఫీన్ అన్నారు.
73 మంది టీనేజీ కుర్రాళ్లపై చేసిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయని ఆయన చెప్పారు. ‘పరిశోధనలో పాల్గొన్న విద్యార్థులు సగటున వారానికి 12 గంటలు టీవీ చూసినా, వారంలో 25 శాతం సమయాన్ని ఫోన్లు, వీడియోగేమ్స్‌తో గడిపేవారు. మిగతా వారికంటే ఈ విద్యార్థులకు పరీక్షలలో చాలా తక్కువ మార్కులు వచ్చాయ’ని ఫీన్ పేర్కొన్నారు. ఈ వివరాలు స్ప్రింగర్ సైకోనమిక్ బులిటెన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.