
సర్వేలో నాకు మార్కులు తగ్గాయట..!
ఒళ్లు దగ్గరపెట్టుకుని పని చేయాల్సిందే
సిరిసిల్ల: ‘సర్వేలో నాకు మార్కులు తగ్గాయట.. జాగ్రత్తగా పనిచేయాలి.. ఇక ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాల్సిందే’నని మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో శనివారం సిరిసిల్ల నియోజకవర్గ టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ కార్యకర్తలతో కొంతగ్యాప్ వచ్చిన మాట వాస్తవమేనని, కానీ మున్ముందు అందుబాటులో ఉంటానన్నారు. సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమంపై స్పష్టమైన మాస్టర్ ప్లాన్, విధానం తనకు ఉందన్నారు. తనను ఇంతవాణ్ణి చేసిన ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. బూత్‌స్థాయిలో పార్టీ సభ్యత్వాలు ఇవ్వాలన్నారు.