న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ పార్టీకి తిరుగుండదని తాజా సర్వే వెల్లడించింది. తెలంగాణలో టీఆర్‌ఎస్ ఎక్కువ సీట్లు గెల్చుకుంటుందని టైమ్స్ నౌ-వీఎంఆర్ నిర్వహించిన ఓపీనియన్ పోల్‌లో తేలింది. ఈరోజు ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్‌కు 10 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు కైవసం చేసుకునే అవకాశముందని తెలిపింది. బీజేపీ, ఎంఐఎం ఒక్కో స్థానం దక్కించుకుంటాయని ఊహించింది. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 12 సీట్లు గెలిచింది. కాంగ్రెస్ రెండు చోట్ల విజయం సాధించింది. బీజేపీ-టీడీపీ కూటమి, ఎంఐఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కో స్థానాన్ని దక్కించుకున్నాయి. టైమ్స్ నౌ-వీఎంఆర్ తాజా సర్వే ప్రకారం గత ఎన్నికలతో పోలిస్తే టీఆర్‌ఎస్ ఈసారి 2 సీట్లు కోల్పోనుంది.
ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్‌కు 16, ఎంఐఎంకు ఒక్క సీటు వస్తాయని ‘నేషనల్ అప్రూవల్ రేటింగ్స్’ పేరిట రిపబ్లిక్ టీవీ-సీ ఓటర్ జరిపిన సర్వే అంచనా వేసింది. రెండు సర్వేల ఫలితాలు భిన్నంగా రావడం గమనార్హం. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. (రిపబ్లిక్ టీవీ సర్వే: లోకసభ ఎన్నికల్లో కారు జోరు..)
Comments
Please login to add a commentAdd a comment