times now-vmr openion poll
-
‘బాలాకోట్’తో మళ్లీ అధికారం!
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాని అయ్యేందుకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని తాజా సర్వేలో తేలింది. ఈసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 279 సీట్లు గెలుచుకుని సాధారణ మెజారిటీతో వరసగా రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని టైమ్స్ నౌ–వీఎంఆర్ సర్వే తెలిపింది. పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్ ఉగ్రశిబిరాలపై వైమానిక దాడులు, రైతులకు పెట్టుబడి సాయం, అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు లాంటి నిర్ణయాలతో ప్రధాని మోదీకి ఆదరణ అమాంతం పెరిగిందని, ఇవే ఈసారి ఎన్నికలను మలుపు తిప్పబోతున్నట్లు పేర్కొంది. ఈ అంచనాలు నిజమైతే, ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడ మెజారిటీ లభించినా 2014 ఎన్నికలతో పోలిస్తే ఎన్డీయే 50 సీట్లు కోల్పోనుంది. 43 శాతం మంది మరోసారి మోదీనే ప్రధానిగా కోరుకున్నారని సర్వే తెలిపింది. 80 స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ–బీఎస్పీ కూటమి పోటీని తట్టుకుని బీజేపీ 50 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే గొప్పగా పుంజుకుని తన బలాన్ని 64 సీట్ల నుంచి 149కి పెంచుకుంటుందని తేల్చింది. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతున్న తృణమూల్ కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ, టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీలకు 115 సీట్లు దక్కే అవకాశాలున్నాయని పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఖాతా తెరవడం కష్టమేనని అభిప్రాయపడింది. తెలంగాణలో టీఆర్ఎస్ 14, కాంగ్రెస్ 2, ఎంఐఎం 1, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ 20 స్థానాలు, టీడీపీ ఐదు స్థానాలు గెలుచుకుంటాయని తెలిపింది. 19 రాష్ట్రాల్లో సుమారు 14 వేల మంది అభిప్రాయాలు సేకరించి టైమ్స్ నౌ–వీఎంఆర్ సర్వే నిర్వహించారు. -
వైఎస్ఆర్సీపీదే హవా
-
టైమ్స్‌నౌ సర్వేలో వైఎస్సార్సీపీ ప్రభంజనం
న్యూఢిల్లీ : తాజా ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ సీపీ ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక సీట్లలో నెగ్గి ప్రభంజనం సృష్టించబోతుందని టైమ్స్ నౌ-వీఎమ్ఆర్ ఒపినియన్ సర్వే వెల్లడించింది. చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ కేవలం 3 ఎంపీ స్థానాలకే పరిమితమవుతుందని ఈ సర్వే స్పష్టం చేసింది. ఈ సర్వే వివరాలను సోమవారం టైమ్స్ నౌ చానెల్ విడుదల చేసింది. మొత్తం 25 లోక్‌సభ స్థానాలకుగానూ వైఎస్సార్ సీపీకి 22 ఎంపీ సీట్లు, టీడీపీకి కేవలం మూడు సీట్లు వస్తాయని ఈ సర్వే అంచనా వేసింది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు ఏపీలో ఒక్క స్థానంలో కూడా గెలవలేవని పేర్కొంది. ఓట్ల శాతం పరంగా చూసినా కూడా సర్వేలో వైఎస్సార్సీపీదే పైచేయిగా ఉంది. వైఎస్సార్ సీపీకి 48.8 శాతం ఓట్లు, టీడీపీకి 38.4 శాతం ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లు సర్వే వెల్లడించింది. ఇప్పటికే అన్నీ సర్వేలు ఏపీలో కాబోయే సీఎం వైఎస్ జగనేనని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇండియా టుడే సర్వే, రిపబ్లిక్ టీవీ సీఓటర్ సర్వేలు ఏపీ ప్రజలు జగన్‌కే పట్టం కట్టనున్నారని వెల్లడించాయి. ఇక తెలంగాణలో టీఆర్ఎస్ హవా కొనసాగుతుందని టైమ్స్ నౌ సర్వే స్పష్టం చేసింది. 17లోక్‌సభ స్థానాలకు 13 సీట్లు టీఆర్ఎస్.. రెండు బీజేపీ, కాంగ్రెస్ 1, ఇతరులు 1 సీటు వస్తుందని ఈ సర్వే వెల్లడించింది. అధికార టీఆర్ఎస్ 41.20 ఓట్ల షేర్‌తో దూసుకుపోనుందని, కాంగ్రెస్‌కు 30.30 శాతం, బీజేపీకి 17.60 శాతం ఓట్ షేర్ లభించనుందని తేల్చింది. -
అన్నదాతల ఆత్మహత్యలపైనా అబద్ధాలే
-
అధికారానికి 20 సీట్ల దూరంలో ఎన్డిఏ
-
టైమ్స్ నౌ సర్వేలో టీఆర్ఎస్కు తగ్గిన సీట్లు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీకి తిరుగుండదని తాజా సర్వే వెల్లడించింది. తెలంగాణలో టీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెల్చుకుంటుందని టైమ్స్ నౌ-వీఎంఆర్ నిర్వహించిన ఓపీనియన్ పోల్‌లో తేలింది. ఈరోజు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్కు 10 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు కైవసం చేసుకునే అవకాశముందని తెలిపింది. బీజేపీ, ఎంఐఎం ఒక్కో స్థానం దక్కించుకుంటాయని ఊహించింది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ 12 సీట్లు గెలిచింది. కాంగ్రెస్ రెండు చోట్ల విజయం సాధించింది. బీజేపీ-టీడీపీ కూటమి, ఎంఐఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కో స్థానాన్ని దక్కించుకున్నాయి. టైమ్స్ నౌ-వీఎంఆర్ తాజా సర్వే ప్రకారం గత ఎన్నికలతో పోలిస్తే టీఆర్ఎస్ ఈసారి 2 సీట్లు కోల్పోనుంది. ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్కు 16, ఎంఐఎంకు ఒక్క సీటు వస్తాయని ‘నేషనల్ అప్రూవల్ రేటింగ్స్’ పేరిట రిపబ్లిక్ టీవీ-సీ ఓటర్ జరిపిన సర్వే అంచనా వేసింది. రెండు సర్వేల ఫలితాలు భిన్నంగా రావడం గమనార్హం. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. (రిపబ్లిక్ టీవీ సర్వే: లోకసభ ఎన్నికల్లో కారు జోరు..) -
పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ హవా
-
ఏపీలో వైఎస్సార్సీపీ హవా
సాక్షి, హైదరాబాద్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుందని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా టైమ్స్ నౌ-వీఎంఆర్ సంస్థలు సంయుక్తంగా చేపట్టిన సర్వే కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మొత్తం 25 లోక్‌సభ స్థానాలకుగాను వైఎస్సార్సీపీకి 23 సీట్లలో విజయకేతనం ఎగరవేస్తుందని, టీడీపీ కేవలం రెండు సీట్లకు మాత్రమే పరిమితమవుతుందని సర్వే తేల్చింది. అటు జాతీయపార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు ఒక్క స్థానంలో కూడా గెలవలేవని తెలిపింది. ఇక ఓట్ల శాతం పరంగా చూసినా వైఎస్సార్సీపీదే పైచేయిగా కనిపించింది. వైఎస్సార్ సీపీ, టీడీపీల మధ్య ఓట్ల వత్యాసం కూడా భారీగానే ఉంటుందని సర్వే పేర్కొంది. వైఎస్సార్సీపీకి 49.5 శాతం ఓట్లు, టీడీపీకి 36 శాతం ఓట్లు పడతాయని వెల్లడించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయగా ఏపీలో టీడీపీకి 15 సీట్లు, బీజేపీకి రెండు సీట్లు రావడం తెలిసిందే. అప్పుడు వైఎస్సార్సీపీ ఏపీలో 8 చోట్ల గెలుపొందింది. (లోక్‌సభ ఎన్నికల్లో ఏపీలో వైఎస్సార్ సీపీ ప్రభంజనం) -
కాంగ్రెస్ 91.. బీజేపీ 89
కన్నడనాట ఎన్నికలు సమీపిస్తున్న పార్టీల మధ్య పోరు నువ్వా–నేనా అన్నట్లు ఆసక్తికరంగా సాగుతోంది. అధికారం తమదంటే తమదని కాంగ్రెస్, బీజేపీలు చెప్పుకుంటున్నప్పటికీ.. వివిధ సర్వే సంస్థలు సోమవారం ప్రకటించిన ఒపీనియన్ పోల్స్ మాత్రం హంగ్ తప్పదని స్పష్టం చేస్తున్నాయి. టైమ్స్ నౌ–వీఎంఆర్ చేసిన సర్వేలో అధికార కాంగ్రెస్ పార్టీ 91 స్థానాల్లో, బీజేపీ 89 చోట్ల విజయం సాధించే అవకాశాలున్నాయని వెల్లడైంది. గత ఎన్నికల్లో 40 సీట్లు గెలిచిన జేడీఎస్ ఈసారి కూడా అదే సంఖ్యలో సీట్లు గెలుచుకుని కీలకంగా మారనుంది. ఏబీపీ–సీఎస్డీఎస్ సర్వే బీజేపీకి 92, కాంగ్రెస్‌కు 88 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. మొత్తం 224 సీట్లలో అధికారం చేజిక్కించుకునేందుకు కనీసం 113 సీట్లు రావాల్సిందే. సీఎస్డీఎస్ సర్వేలో ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య 46.15%, యడ్యూరప్పకు 31.76%, కుమారస్వామికి 17.63% మంది మద్దతు లభించింది. టైమ్స్‌నౌ–వీఎంఆర్ సర్వేను ప్రాంతాల వారిగా గమనిస్తే.. బాంబే కర్ణాటకలో బీజేపీ ఓటుశాతం 2013 అసెంబ్లీ ఎన్నికల కంటే గణనీయంగా పెరగనుందని సర్వేల ద్వారా స్పష్టమైంది. బాంబే కర్ణాటక ప్రాంతంలో మొత్తం 50 సీట్లున్నాయి. బాగల్కోట్, ధార్వాడ్, బెళగావి, బీజాపూర్, గదగ్ తదితర జిల్లాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడున్న సీట్లలో 2013లో కాంగ్రెస్ 31 చోట్ల గెలవగా.. బీజేపీ 13, జేడీఎస్ ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఈ ప్రాంతంలో బలంగా ఉన్న లింగాయత్‌లపై.. కాంగ్రెస్ ఇస్తామన్న ‘మతపరమైన మైనారిటీ హోదా’ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని సర్వే తెలిపింది. గతంలో 13 సీట్లున్న బీజేపీ ఈసారి 23 సీట్లు గెలుచుకునే అవకాశం ఉండగా.. కాంగ్రెస్ 10 స్థానాలు కోల్పోనుంది. కోస్తా కర్ణాటకలో..: ఈ ప్రాంతంలో మొత్తం 21 సీట్లున్నాయి. దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, ఉడుపి తదితర జిల్లాలు ఈ ప్రాంతంలో ఉంటాయి. కర్ణాటకలో ముస్లింలు, క్రైస్తవుల సంఖ్య కూడా ఈ ప్రాంతంలో ఎక్కువే. అయితే ఈసారి మెజారిటీ సీట్లలో గెలవాలంటే మతపరమైన పోలరైజేషన్ తప్పనిసరని బీజేపీ భావిస్తోంది. అందుకే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. గ్రేటర్ బెంగళూరులో.. బెంగళూరు నగరంతోపాటు చుట్టుపక్కనున్న 32 నియోజకవర్గాలు గ్రేటర్ బెంగళూరు పరిధిలోకి వస్తాయి. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ 15 చోట్ల, బీజేపీ 12 చోట్ల గెలిచాయి. ఈ ప్రాంతంలో ఎక్కువ సీట్లు గెలిచే పార్టీకే అధికారం అందే అవకాశాలుంటాయి. చదువుకున్న ఓటర్లు ఈ నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉండటం వల్ల పలు అభివృద్ధి అంశాలతోపాటుగా సిద్దరామయ్య లేవనెత్తిన ‘కన్నడ అస్మిత’, బీజేపీ అస్త్రమైన ‘హిందుత్వ’లు కీలకంగా పనిచేస్తాయని భావిస్తున్నారు. ఈసారి రెండు పార్టీలూ తమ సీట్లను మరో రెండు మూడు వరకు పెంచుకునే అవకాశం ఉందని సర్వే తెలిపింది. మధ్య కర్ణాటకలో.. దీన్నే మలెనాడు ప్రాంతం అనికూడా అంటారు. 35 స్థానాలున్న ఈ ప్రాంతంలో యడ్యూరప్ప ప్రభావం స్పష్టంగా ఉంటుంది. బీజేపీకి సానుకూలమైన సెంట్రల్ కర్ణాటకలో 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ 19 సీట్లు గెలుచుకుంది. ఈసారి బీజేపీ.. 22 సీట్లను గెలుచుకోవచ్చని టైమ్స్‌నౌ సర్వే పేర్కొంది. హైదరాబాద్ కర్ణాటక ఈ ప్రాంతంలో ముస్లింల జనాభా ఎక్కువ. కర్ణాటకలోని అత్యంత వెనుకబడిన ప్రాంతమైన హైదరాబాద్ కర్ణాటకలో మొత్తం 31 నియోజకవర్గాలున్నాయి. 2013లో కాంగ్రెస్ 19చోట్ల, బీజేపీ 4చోట్ల గెలిచాయి. బీదర్, గుల్బర్గా, బెళ్లారి, రాయ్‌చూర్ వంటి జిల్లాలు ప్రధానమైనవి. ఈ ప్రాంతంపై యడ్యూరప్పకు మంచి పట్టుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 15 స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయని సర్వే తెలిపింది. పాత మైసూరు తమిళం మాట్లాడేవాళ్లు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో జేడీ(ఎస్)కు మంచి పట్టుంది. మొత్తం 55 స్థానాల్లో మెజారిటీ చోట్ల ఇక్కడ ఒక్కళిగలు ఫలితాలను ప్రభావితం చేయగలరు. 2013లో కాంగ్రెస్ 25, జేడీఎస్ 23, బీజేపీ కేవలం రెండు స్థానాలు గెలుచుకున్నాయి. ఈ ఎన్నికల్లో జేడీఎస్ ప్రభావం బీజేపీ కంటే కాంగ్రెస్‌పైనే ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉందని సర్వేలో తేలింది. అందుకే బీజేపీ గతంలో కన్నా ఆరు సీట్లను, జేడీఎస్ రెండు సీట్లను అదనంగా గెలుచుకోవచ్చని తెలిపింది. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కన్నా సిద్దరామయ్య ప్రభావమే ఎక్కువగా కనబడుతుంది. -
యూపీ అధికార పీఠం బీజేపీదే
-
యూపీ అధికార పీఠం బీజేపీదే
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధికారం పీఠం ఎవరిది? కాంగ్రెస్‌తో జట్టు కట్టిన అధికార సమాజ్‌వాదీ పార్టీ మళ్లీ గెలుస్తుందా? లేక బీఎస్పీ అధినేత్రి మాయావతిపై ఓటర్లు కరుణ చూపుతారా? టైమ్స్ నౌ-వీఎంఆర్ ఒపీనియన్ పోల్ ప్రకారం బీజేపీ అధికారంలోకి వస్తుందట. త్వరలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలపై సర్వే నిర్వహించింది. యూపీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, మెజార్టీ సీట్లు సాధిస్తుందని టైమ్స్ నౌ-వీఎంఆర్ సర్వేలో తేలింది. యూపీ శాసనసభలో 403 సీట్లు ఉండగా, బీజేపీ 202 స్థానాలు గెలుస్తుందని వెల్లడించింది. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి 19 శాతం ఓట్లు అధికంగా వస్తాయని సర్వేలో తేలింది. కాగా అధికార ఎస్పీకి పరాజయం తప్పదని, ఎస్పీ-కాంగ్రెస్ కూటమికి 147 సీట్లు వస్తాయని పేర్కొంది. దీంతో ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రతిపక్షంలో కూర్చోకతప్పదని అంచనా వేసింది. ఇక బీఎస్పీ కేవలం 47 సీట్లతో మూడో స్థానానికి పరిమితమవుతుందని సర్వేలో తేలింది.