ఏపీలో వైఎస్సార్‌సీపీ హవా | Times Now And VMR Survey Predicts YSRCP Win 23 Lok Sabha Seats In AP | Sakshi
Sakshi News home page

Published Wed, Jan 30 2019 7:05 PM | Last Updated on Sat, Mar 9 2019 3:34 PM

Times Now And VMR Survey Predicts YSRCP Win 23 Lok Sabha Seats In AP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ హవా కొనసాగుతుందని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా టైమ్స్‌ నౌ-వీఎంఆర్‌ సంస్థలు సంయుక్తంగా చేపట్టిన సర్వే కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మొత్తం 25 లోక్‌సభ స్థానాలకుగాను వైఎస్సార్‌సీపీకి 23 సీట్లలో విజయకేతనం ఎగరవేస్తుందని, టీడీపీ కేవలం రెండు సీట్లకు మాత్రమే పరిమితమవుతుందని సర్వే తేల్చింది. అటు జాతీయపార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు ఒక్క స్థానంలో కూడా గెలవలేవని తెలిపింది.

ఇక ఓట్ల శాతం పరంగా చూసినా వైఎస్సార్‌సీపీదే పైచేయిగా కనిపించింది. వైఎస్సార్‌ సీపీ, టీడీపీల మధ్య ఓట్ల వత్యాసం కూడా భారీగానే ఉంటుందని సర్వే పేర్కొంది. వైఎస్సార్‌సీపీకి 49.5 శాతం ఓట్లు, టీడీపీకి 36 శాతం ఓట్లు పడతాయని వెల్లడించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయగా ఏపీలో టీడీపీకి 15 సీట్లు, బీజేపీకి రెండు సీట్లు రావడం తెలిసిందే. అప్పుడు వైఎస్సార్‌సీపీ ఏపీలో 8 చోట్ల గెలుపొందింది. (లోక్‌సభ ఎన్నికల్లో ఏపీలో వైఎస్సార్‌ సీపీ ప్రభంజనం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement