న్యూఢిల్లీ : తాజా ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ సీపీ ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక సీట్లలో నెగ్గి ప్రభంజనం సృష్టించబోతుందని టైమ్స్ నౌ-వీఎమ్‌ఆర్ ఒపినియన్ సర్వే వెల్లడించింది. చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ కేవలం 3 ఎంపీ స్థానాలకే పరిమితమవుతుందని ఈ సర్వే స్పష్టం చేసింది. ఈ సర్వే వివరాలను సోమవారం టైమ్స్ నౌ చానెల్ విడుదల చేసింది. మొత్తం 25 లోక్‌సభ స్థానాలకుగానూ వైఎస్సార్ సీపీకి 22 ఎంపీ సీట్లు, టీడీపీకి కేవలం మూడు సీట్లు వస్తాయని ఈ సర్వే అంచనా వేసింది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు ఏపీలో ఒక్క స్థానంలో కూడా గెలవలేవని పేర్కొంది. ఓట్ల శాతం పరంగా చూసినా కూడా సర్వేలో వైఎస్సార్‌సీపీదే పైచేయిగా ఉంది. వైఎస్సార్ సీపీకి 48.8 శాతం ఓట్లు, టీడీపీకి 38.4 శాతం ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లు సర్వే వెల్లడించింది. ఇప్పటికే అన్నీ సర్వేలు ఏపీలో కాబోయే సీఎం వైఎస్ జగనేనని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇండియా టుడే సర్వే, రిపబ్లిక్ టీవీ సీఓటర్ సర్వేలు ఏపీ ప్రజలు జగన్‌కే పట్టం కట్టనున్నారని వెల్లడించాయి.
ఇక తెలంగాణలో టీఆర్‌ఎస్ హవా కొనసాగుతుందని టైమ్స్ నౌ సర్వే స్పష్టం చేసింది. 17లోక్‌సభ స్థానాలకు 13 సీట్లు టీఆర్‌ఎస్.. రెండు బీజేపీ, కాంగ్రెస్ 1, ఇతరులు 1 సీటు వస్తుందని ఈ సర్వే వెల్లడించింది. అధికార టీఆర్‌ఎస్ 41.20 ఓట్ల షేర్‌తో దూసుకుపోనుందని, కాంగ్రెస్‌కు 30.30 శాతం, బీజేపీకి 17.60 శాతం ఓట్ షేర్ లభించనుందని తేల్చింది.
Comments
Please login to add a commentAdd a comment