
సాక్షి, హైదరాబాద్: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 9 నుంచి 18 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ జూనియర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. తిరిగి కాలేజీలు ఈనెల 19న ప్రారంభం అవుతాయని పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని మేనేజ్‌మెంట్‌లు ఈ సెలవులను పాటించాలని, సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తే సంబంధిత మేనేజ్‌మెంట్లు, ప్రిన్సిపాళ్లపై కఠిన చర్యలు చేపడతామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment