ఆంధ్రప్రదేశ్ విభజనానంతరం ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టో హామీని నెరవేర్చే పేరుతో ఏపీలోని 446 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న 3,776 మంది, డిగ్రీ కాలేజీల్లోని 704 మంది, పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టర్ లెక్చరర్ల సర్వీసు క్రమబద్ధీకరణపై, సమస్యలపై అధ్య యనానికి 2014 సెప్టెంబర్ 9న కేబినెట్ సబ్ కమిటీని ఏర్పర్చింది. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్, పల్లె రఘు నాధరెడ్డి సభ్యులుగా ఉన్న ఈ సబ్ కమిటీ గత రెండేళ్లలో ఒక్క సమావే శాన్ని కూడా నిర్వహించక పోవడం ప్రభుత్వ ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షకు నిదర్శనం.
కాంట్రాక్ట్ లెక్చరర్ల అసోసియేషన్ విజయవాడలో 25-02-2015న నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సమాచార మంత్రి పల్లె రఘునాథరెడ్డి కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణకు చర్యలు చేపడతామని హామీనిచ్చారు. మరోవైపున సీఎంతో సహా, కేబినెట్ సబ్ కమిటీ సభ్యు లను అసోసియేషన్ ప్రతినిధులు ప్రతి జిల్లాలో కలిసి తమ సమస్యల పరిష్కారం కోసం అభ్యర్థిస్తున్నా ఇదిగో అదిగో అంటూ మభ్యపెడుతూ, కాలం గడుపుతున్నారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టు లెక్చర ర్ల క్రమబ ద్దీకరణకు అడ్డంగా ఉన్న 2/94 చట్టాన్ని సవరించడానికి అడుగులేస్తోంది.
కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరిస్తా మని తెలంగాణ సీఎం కేసీఆర్ పలుసార్లు స్పష్టం చేశారు. హిమాచల్ ప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కాంట్రాక్టు అధ్యాపకులను గతంలోనే క్రమబద్ధీ కరించారు. కానీ రాష్ట్రంలోని 13,671 మంది కాంట్రాక్టు ఉద్యోగుల్లో విద్యాశాఖలోని అత్యధికంగా ఉన్న 5,757 మంది కాంట్రాక్టు లెక్చరర్లను గుర్తించడం వరకే పరిమిత మైన ఏపీ ప్రభుత్వం వీరి సమస్యను దాటవేయడంతోనే పొద్దు గడుపుతోంది. గత 16 ఏళ్లుగా మూసివేత దిశగా ఉన్న ప్రభుత్వ కళాశాలలకు ప్రాభవం తీసుకురావ డంలో కాంట్రాక్టు అధ్యాపక వ్యవస్థ సాటిలేని కృషి సల్పింది. విద్యార్థుల సంఖ్య పెంపుదల, పరీక్షా ఫలితాల సాధనలో గణనీయ ప్రగతిని సాధించినట్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. కానీ కాంట్రాక్టు లెక్చరర్ల సంక్షేమం పట్ల నేటి చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు.
10వ వేతన సవరణ సంఘం కాంట్రాక్టు లెక్చరర్లకు మూలవేతనం, డీఎ ఇవ్వమని సిపార్సు చేసినా వాటి అమలుపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్య వైఖరితో ఉంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎన్నడూ లేనివిధంగా 2016-17 సంవత్సరానికి రెన్యువల్ ప్రక్రియ ఉత్తర్వుల జారీలో తీవ్ర జాప్యం నెలకొంది. దీంతో గత 4 నెల లుగా పనిచేస్తున్నప్పటికీ జీతాలు అందుకోలేని స్థితి. ఈ ఏడాదిలో జీతం లేని వేసవిని, జీతం అందని కాలాన్ని కలుపుకుంటే సుమారు 6 నెలలుగా వేతనాలు లేకుండా కాంట్రాక్టు అధ్యాపకులు క్షోభకు గురవుతున్నారు.
దినదినగండంగా ఉన్న ఉద్యోగాన్ని నమ్ముకుని చిత్తశుద్ధితో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలను ప్రభుత్వం గుర్తించకపోగా అదనపు నిబంధనలు, అవ రోధాలు కల్గించడం దారుణం. దీంతో తమ ఉద్యోగాల కొనసాగింపు అంశంలో ఏర్పడుతున్న అవరోధాలు గమ నించడానికే వారి శక్తియుక్తులన్నీ సరిపోతున్నాయి. ఈ ఉదాశీనత కొనసాగితే అధ్యాపకులు మిలిటెంట్ పోరా టాలకు పాల్పడాల్సి వస్తుంది. ప్రభుత్వం మొండి వైఖ రిని విడనాడి కాంట్రాక్టు లెక్చరర్లను ఆదుకోవాలి.
కుమ్మరకుంట సురేష్, అధ్యక్షులు, ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్, ప్రకాశం జిల్లా మొబైల్ : 94910 03093
కాంట్రాక్టు లెక్చరర్లపై ఇంత వివక్షా?
Published Tue, Sep 20 2016 1:01 AM | Last Updated on Mon, Aug 27 2018 8:44 PM
Advertisement