సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యాశాఖ పరిధిలోని 27 గురుకుల పాఠశాలలను గురుకుల జూనియర్ కాలేజీలుగా ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. ఇందులో 13 బాలుర, 14 బాలికల పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ కాలేజీల్లో రెండేళ్ల ఇంటర్మీడియట్ కోర్సును 2018–19 విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఈసారి ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ప్రవేశాలు కల్పించాలని, ప్రతి గ్రూప్‌లో 40 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని సూచించారు. ఇందుకు 405 పోస్టులను మంజూరు చేయాలని, అందుకోసం రూ.117.79 కోట్లు విడుదల చేయాలని విద్యా శాఖ గురుకులాల సొసైటీ కార్యదర్శి ప్రతిపాదనలు పంపారు. అయితే పోస్టుల మంజూరుకు సంబంధించిన ఉత్తర్వులను వేరుగా జారీ చేస్తామని వెల్లడించారు.
జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసిన గురుకులాలు
బాలుర గురుకులాలు (ప్రాంతం–జిల్లా)..
బెల్లంపల్లి– మంచిర్యాల, పెద్దాపూర్ క్యాంపు– జగిత్యాల, మేడారం– పెద్దపల్లి, వేలేర్– వరంగల్ అర్బన్, బండారుపల్లి– జయశంకర్ భూపాలపల్లి, ఎంకూర్– ఖమ్మం, తుంగతుర్తి– సూర్యాపేట, పోచంపాడు– నిజామాబాద్, మద్నూర్– కామారెడ్డి, బీచుపల్లి– జోగుళాంబ గద్వాల, తూప్రాన్– మెదక్, లింగంపల్లి– సంగారెడ్డి, బోరబండ– హైదరాబాద్.
బాలికల గురుకులాలు (ప్రాంతం–జిల్లా)..
నిర్మల్– నిర్మల్, తాటిపల్లి– జగిత్యాల, నేరెళ్ల– సిరిసిల్ల రాజన్న, వంగర– వరంగల్ అర్బన్, నెక్కొండ– వరంగల్ రూరల్, కొడకండ్ల– జనగాం, బూర్గంపాడ్– భద్రాద్రి కొత్తగూడెం, చౌటుప్పల్– యాదాద్రి భువనగిరి, పోచంపాడు– నిజామాబాద్, బోధన్– నిజామాబాద్, మెదక్– మెదక్, దిగ్వాల్– సంగారెడ్డి, బోరబండ– హైదరాబాద్, తాండూరు– వికారాబాద్.
జూనియర్ కాలేజీలుగా 27 గురుకులాలు
Published Thu, Mar 22 2018 1:28 AM | Last Updated on Thu, Mar 22 2018 1:28 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment