పొగాకు పరిశ్రమలకు తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: పొగాకు ఉత్పత్తులపై ‘ఆరోగ్యానికి హానికరం’ అని సూచించే చిత్రాలు 85 శాతం ముద్రించాలని సుప్రీంకోర్టు బుధవారం తేల్చిచెప్పింది. కేంద్రం ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తున్న నిర్ణయంపై కోర్టుకు వెళ్లిన పొగాకు పరిశ్రమలకు తాజా తీర్పుతో ఎదురుదెబ్బ తగిలినట్లయింది. కర్ణాటక కోర్టు ఇచ్చిన స్టేను నిలిపివేస్తూ సుప్రీం తీర్పునిచ్చింది.
ఇదివరకు సిగరెట్ ప్యాకెట్లపై ఉన్న ఆరోగ్యానికి హానికరమని సూచించే చిత్రాల సైజును 20 శాతం నుంచి 80 శాతానికి మారుస్తూ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. వాదనల సమయంలో సమాజం పట్ల మీకు బాధ్యత ఉండాలని పొగాకు పరిశ్రమలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది.
హెచ్చరిక చిత్రాలు ఉండాల్సిందే
Published Thu, May 5 2016 7:37 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement