సాక్షి,బెంగళూరు: చిల్లర దుకాణాల్లో పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై చట్టబద్దమైన నిషేధాజ్ఞాలు జారీ చేయడానికి సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం వెంటనే తమ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కర్ణాటక రాష్ట్ర పొగాకు ఉత్పత్తుల వ్యాపారస్థుల సంఘం నాయకులు, సభ్యులు డిమాండ్ చేశారు. చిల్లర దుకాణాల్లో పొగాకు ఉత్పత్తులపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ మెజిస్టిక్ బస్టాండ్ నుంచి ఫ్రీడం పార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ మాట్లాడుతూ...కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం వల్ల చిల్లర వ్యాపారస్థులు తీవ్రంగా నష్టపోనున్నారన్నారు.
చిల్లర దుకాణాల్లో పొగాకు ఉత్పత్తులు విక్రయించరాదంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల మందికిపైగా చిల్లర వ్యాపారస్థుల కుటుంబాలు రోడ్డు పడనున్నాయన్నారు. దీనిపై ప్రధాని నరేంద్రమోదీ మరోసారి పునరాలోంచించాలని, ఒకవేళ నిషేధం తప్పనిరి చేస్తే చిల్లర వ్యాపారస్థులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలంటూ డిమాండ్ చేశారు. ర్యాలీలో సంఘం ప్రధాన కార్యదర్శి మునిరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment