సాక్షి, సిటీబ్యూరో: మధ్య మండలంలోని నిజాం కాలేజీ మైదానంలో ఆదివారం టీజాక్ నేతలు తలపెట్టిన సకల జనుల భేరీకి నగర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. గ్రౌండ్స్‌తోపాటు దాని చుట్టూ, పరిసర ప్రాంతాల్లో దాదాపు 3 వేల మంది పోలీసుల్ని మోహరించనున్నారు. బందోబస్తు, భద్రత విధుల్లో నగర పోలీసులతో పాటు కేంద్ర, రాష్ట్ర బలగాలు పాలు పంచుకోనున్నాయి. నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ ఆదేశాల మేరకు మధ్య మండల డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డి బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. ఈ సభ నేపథ్యంలో కళాశాల చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9 వరకు ఇవి అమలులో ఉంటాయి.
తాజ్ మహల్ జంక్షన్, బొగ్గులకుంట వైపు నుంచి బషీర్‌బాగ్ చౌరస్తా వైపు వచ్చే వాహనాలను కింగ్ కోఠి చౌరస్తా నుంచి ఈడెన్ గార్డెన్ జంక్షన్ వైపు పంపిస్తారు
అంబేద్కర్ విగ్రహం వైపు నుంచి బషీర్‌బాగ్ చౌరస్తా వైపు వచ్చే వాహనాలను లిబర్టీ జంక్షన్ నుంచి హిమాయత్‌నగర్ ‘వై’ జంక్షన్ వైపు పంపిస్తారు
ఈడెన్ గార్డెన్ జంక్షన్ వైపు నుంచి వచ్చే వాహనాలను కింగ్ కోఠి చౌరస్తా నుంచి తాజ్ మహల్ జంక్షన్, బొగ్గులకుంట వైపు మళ్లిస్తారు
సిమెట్రీ జంక్షన్ నుంచి బషీర్‌బాగ్ చౌరస్తా వైపు వచ్చే వాహనాలను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి హిమాయత్‌నగర్ ‘వై’ జంక్షన్ వైపు పంపిస్తారు
నారాయణగూడ చౌరస్తా నుంచి బషీర్‌బాగ్ చౌరస్తా వైపు వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్ ‘వై’ జంక్షన్ నుంచి లిబర్టీ వైపు మళ్లిస్తారు
రవీంద్రభారతి, నాంపల్లి వైపు నుంచి వచ్చే వాహనాలను పీసీఆర్, ఏఆర్ పెట్రోల్‌పంప్ నుంచి బషీర్‌బాగ్ చౌరస్తా వైపు అనుమతించరు
చర్మాస్ నుంచి బషీర్‌బాగ్ చౌరస్తాకు వచ్చే వాహనాలను ఎస్బీహెచ్ జంక్షన్ నుంచి సుజాత హైస్కూల్ వైపు పంపిస్తారు
బహీర్ కేఫ్ వైపు నుంచి నిజాం కాలేజ్ గేట్ నెం.3, 4 వైపు వచ్చే వాహనాలను ఎన్‌సీసీ లైన్ నుంచి కోఠి చౌరస్తా వైపు పంపిస్తారు
‘సకల’ సన్నాహాలు
Published Sun, Sep 29 2013 2:12 AM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM
Advertisement
Advertisement