Nizam College Ground
-
సీఎం కుర్చీ లాగుతాం
మాలల మహాగర్జన బహిరంగ సభలో కేసీఆర్‌కు వక్తల హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: దళితులకు మంత్రివర్గంలో నిష్పత్తి ప్రకారం స్థానం కల్పించకుంటే మరో ఉద్యమం చేయాల్సి వస్తుందని, సీఎం కుర్చీ లాగేస్తామని మాలల మహాగర్జన బహిరంగసభలో వక్తలు హెచ్చరించారు. ఏడు శాతంగా ఉన్న అగ్రకులాలవారికి మంత్రివర్గంలో 11 మంత్రి పదవులిచ్చి, 17 శాతంగా ఉన్న ఎస్సీలకు ఒకటి, 51 శాతంగా ఉన్న బీసీలకు 4 మంత్రి పదవులిచ్చి వివక్ష చూపారంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో తెలంగాణ రాష్ట్ర మాల- మాల అనుబంధ కులాల సమాఖ్య (ఎంఎంఏకేఎస్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాలల మహాగర్జనలో పలువురు నేతలు ప్రసంగించారు. ఆర్పీఐ జాతీయ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు రాందాసు అథవాలె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు భాగాన నిలిచిన ఎస్సీలకు ప్రాధాన్యత ప్రకారం మంత్రివర్గంలో స్థానం కల్పించాలన్నారు. ప్రాణాలర్పించైనా మాలలు హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. హిందువులుగా మారిన ముస్లింలు, క్రిస్టియన్లను ఘర్ వాపసీ చేయాలని, లేనిపక్షంలో బుద్ధిస్టులుగా మార్చాలన్నారు. ఎస్సీ, ఎస్టీ బ్యాగ్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ దళిత్ ముక్తి మోర్చా అధ్యక్షుడు, ప్రొఫెసర్ జోగేంద్ర ఖవాడె మాట్లాడుతూ.. దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పిన కేసీఆర్ హామీని విస్మరించారని, చివరికి మంత్రివర్గంలో కూడా దళితులకు న్యాయం కల్పించలేదని విమర్శించారు. పార్లమెంటు, శాసనసభ హాళ్లల్లో అంబేడ్కర్ విగ్రహాలు పెట్టాలని దీక్ష చేసిన ఎంపీ కవితకున్న జ్ఞానం కూడా ఆమె తండ్రి, సీఎం కేసీఆర్‌కు లేదని ఎద్దేవా చేశారు. దళితులను అణచి వేసే ప్రయత్నం చేస్తే ముఖ్యమంత్రి కుర్చీని లాగేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎంఎంఏకేఎస్ చైర్మన్ సుద్దాల దేవయ్య, బీజేపీ ఎమ్మెల్యేలు లక్ష్మణ్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్, టీడీపీ ఎమ్మెల్యే సాయన్న, ప్రజాగాయకురాలు విమలక్క , మాల- మాల అనుబంధ కులాల సమాఖ్య(ఎంఎంఏకేఎస్) నాయకులు బాలనాథం, మంద భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
మార్చి 1 నుంచి ‘తెలంగాణ జనజాతర’
సాక్షి, హైదరాబాద్; హైదరాబాద్‌లో మార్చి 1 నుంచి 4వ తేదీ వరకు జరపతలపెట్టిన సీపీఐ(ఎం) రాష్ట్ర తొలి మహాసభల సందర్భంగా నిజాం కాలేజ్ గ్రౌండ్లో ప్రత్యామ్నాయ ప్రజాసంస్కృతి ప్రతిబింబించే విధంగా తెలంగాణ జన జాతర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతిరోజు ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ కార్యక్రమానికి సంబంధించిన కళారూపాలను ప్రదర్శించటానికి ఆరు ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. -
ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ ఆవిర్భావం
హైదరాబాద్, న్యూస్‌లైన్: క్రైస్తవులు, మైనార్టీలు, దళితుల శ్రేయస్సు లక్ష్యంతో ‘ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ’ ఆవిర్భవించింది. శుక్రవారం హైదరాబాద్‌లోని నిజాం కళాశాల మైదానంలో ఆ పార్టీ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండా, గుర్తు, కండువాలను ఆవిష్కరించారు. సభకు పలు జిల్లాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. బీహార్ రాజ్యసభ సభ్యుడు అలీ అన్వర్ అన్సారీ, ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్‌పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎం.ఉదయ్‌కుమార్, జాతీయ ప్రధాన కార్యదర్శి పాల్ దేవప్రియం పుల్లా, హైదరాబాద్ మేయర్ మాజీద్ హుస్సేన్, కంచె ఐలయ్య, సిక్కు కమ్యూనిటీ ప్రతినిధి విశ్రాంత, సామాజిక తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ పలువురు బిషప్‌లు పాల్గొన్నారు. సాధారణ ఎన్నికల్లో తమ పార్టీకి బూర గుర్తును ఎన్నికల కమిషన్ కేటాయించినట్లు తెలిపారు. -
ఉద్యమ స్ఫూర్తి చాటిన జిల్లా వాసులు
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : హైదరాబాద్‌లోని నిజాం కళాశాల గ్రౌండ్లో ఆదివారం నిర్వహించిన సకల జనభేరి బహిరంగ సభకు జిల్లా తెలంగాణవాదులు జై కొట్టారు. ఉదయమే వాహనాల్లో పట్నానికి తరిలారు. సుమారు 25 వేల మంది వరకు జిల్లా ముద్దుబిడ్డలు జనభేరికి వెళ్లారు. రాజకీయ జేఏసీ, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక జేఏసీ నేతలు, విద్యార్థులు, మహిళలు ఎవరికి వారు స్వచ్ఛందంగా తరలివెళ్లారు. పలువురు వాహనాల ద్వారా వెళ్లగా.. మరికొందరు రైలు మార్గం గుండా హైదరాబాద్ పయనమయ్యారు. భారీగా తరలిన నేతలు.. జనభేరికి బయల్దేరే ముందు ఆర్అండ్బీ విశ్రాంతి భవనం ఎదుట ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ.. తెలంగాణ ప్రకటించి, ప్రక్రియ ప్రారంభంలో ఆలస్యం చేస్తున్న యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణకు మాత్రమే ఒప్పుకుంటామని, మరే ప్రతిపాదనలు అవసరం లేదన్నారు. ఆదిలాబాద్ నుంచి వెళ్లిన వారిలో టీఎన్జీవో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అశోక్, వనజారెడ్డి, బీసీ వెల్ఫేర్ మినిస్టీరియల్ స్టాఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్, టీఆర్ఎస్ జిల్లా పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, నాయకులు అడ్డి భోజారెడ్డి, సాజిదొద్దీన్, జేఏసీ అధికార ప్రతినిధి కారింగుల దామోదర్, తదితరులు ఉన్నారు. మంచిర్యాల నుంచి ఎమ్మెల్యే అరవింద్‌రెడ్డి, టీఆర్ఎస్ తూర్పు జిల్లా అధ్యక్షుడు పురాణం సతీశ్, టీఎన్జీవో అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, తెలంగాణ ఉద్యోగ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీపతిబాబు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జగన్మోహన్రావు తదితరులు వేలాది మందితో వాహనాలు, రైళ్లలో హైదరాబాద్ తరలివెళ్లారు. శ్రీరాంపూర్, లక్సెట్టిపేట, దండేపల్లి నుంచి కూడా పెద్దఎత్తున కదిలారు. నిర్మల్ నుంచి జేఏసీ జిల్లా కో కన్వీనర్ కొట్టె శేఖర్, టీఎన్జీవోస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మోయినొద్దీన్, విద్యసాగర్, అటవీ శాఖాధికారులు సాగర్, సృజన్, మధుసూదన్, టీవీవీ అధ్యక్షుడు విజయ్‌కుమార్, ఉపాధ్యాయ సంఘాలు, టీఆర్ఎస్ నాయకులు తరలివెళ్లారు. సారంగాపూర్, మామడ ప్రాంతాల నుంచి పలువురు వాహనాల్లో బయల్దేరారు. ఆసిఫాబాద్ నుంచి టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి కొవలక్ష్మి ఆధ్వర్యంలో జిల్లా నాయకులు పెందూర్ గోపి, బీజేపీ నాయకుడు భువనగిరి సతీశ్‌బాబుతో సహా 500 మంది వెళ్లారు. నార్నూర్ ప్రాంతం నుంచి 50 మంది వాహనాల్లో బయలుదేరారు. వాంకిడి, రెబ్బెన, జైనూర్, ఇచ్చోడ నుంచి టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు రాములునాయక్ ఆధ్వర్యంలో వందలాది మంది వెళ్లారు. బోథ్ నుంచి జేఏసీ డివిజన్ కన్వీనర్ రావుల శంకర్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ ముత్యంరెడ్డి, బెల్లంపల్లి నుంచి టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆర్.ప్రవీణ్, పట్టణ అధ్యక్షుడు పి.సురేశ్, టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా సంయుక్త కార్యదర్శి జి.చంద్రశేఖర్, ఆర్గనైజింగ్ సెక్రటరి సంపత్ తదితరుల ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాల్లో సుమారు 200 మంది తెలంగాణవాదులు తరిలారు. భీమిని, నెన్నెల, కాసిపేట, చెన్నూర్, కోటపల్లి, జైపూర్, మందమర్రి, కోటపల్లి, జైపూర్, రామకృష్ణాపూర్, ఖానాపూర్, కడెం, ఇంద్రవెల్లి, జన్నారం, ఉట్నూర్, ముథోల్, లోకేశ్వరం, కుంటాల, కుభీర్, తానూరు, బాసర, భైంసా, కాగజ్‌నగర్ నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో తెలంగాణవాదులు వెళ్లారు. -
సకలం.. సన్నద్ధం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుతగులుతున్న నేతల బండారాన్ని బట్టబయలుచేసేందుకు ఉద్దేశించిన ‘సకల జనభేరి’కి జిల్లా సన్నద్ధమైంది. గడిచిన వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా వివిధ రూపాల్లో సన్నాహక కార్యక్రమాలు జరిగాయి. పొలిటికల్ జేఏసీ పిలుపుతో చేపట్టిన ఈ సభ హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ గ్రౌండ్లో ఆదివారం మధ్యాహ్నం నుంచి జరగనుంది. ఈ భేరిని విజయవంతం చేసేందుకు ఇప్పటికే ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాలు, విద్యార్థులు, వివిధ జేఏసీలు ర్యాలీలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సులు నిర్వహించాయి. పొలిటికల్ జేఏసీ నేతృత్వంలో ఆయా జేఏసీలు పాల్గొనగా సన్నాహక కార్యక్రమాలన్నీ విజయవంతమయ్యాయి. శనివారం జిల్లా వ్యాప్తంగా బైక్ ర్యాలీలు జరిగాయి. సకల జనభేరిని విజయవంతం చేయాలని కోరుతూ సూర్యాపేటలో జేఏసీ నేతల ఆధ్వర్యంలో మాక్-వాక్ నిర్వహించారు. సీపీఐ కూడా భేరిలో పాల్గొంటుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ నల్లగొండలో ప్రకటించారు. టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీలు ఇప్పటికే జనభేరికి జన సమీకరణలో ఉన్నాయి. సమావేశాలు, ర్యాలీలు.. మిర్యాలగూడలో గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం సమావేశం నిర్వహించింది. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మిర్యాలగూడలో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. వేములపల్లిలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సకల జనభేరి వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. సూర్యాపేట పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ జరపగా, తెలంగాణ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. చివ్వెంల మండల కేంద్రంలో డీటీఎఫ్ ఆధ్వర్యంలో సమావేశం జరి పారు. భూదాన్ పోచంపల్లిలో పోస్టర్ ఆవిష్కరించారు. భువనగిరిలో అరగుండు, అర మీసంతో వచ్చిన గాంధీనాయక్‌కు సన్మానం చేశారు. ఆలేరులో సీపీఐ (ఎంఎల్) న్యూడెమాక్రసీ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు. యాదగిరిగుట్టలో టీఎన్జీఓలు సమావేశం నిర్వహించారు. చౌటుప్పల్‌లో కళాశాలల విద్యార్థులతో హైవేపై ర్యాలీ నిర్వహించారు. పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సమావేశమయ్యారు. సకలజన భేరికి ఉపాధ్యాయులంతా తరలివెళ్లాలని నిర్ణయించారు. మునుగోడులో బీజేపీ నాయకులు సమావేశం నిర్వహించారు. దేవరకొండలో టీఆర్ఎస్ నేతలు హైదరాబాద్‌కు తరలి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గం నుంచి కనీసం వెయ్యి మందిని తరలించడానికి సం బంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. టీఎన్జీఓస్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులను తరలివెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. నాగార్జునసాగర్ ని యోజకరవర్గంలో హాలియా, పెద్దవూర, గుర్రంపోడు మండలాల్లో టీఆర్ఎస్, జేఏసీ నాయకులు సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ముఖ్యమంత్రి తీరును విమర్శిం చారు. హుజూర్‌నగర్‌లో జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాసెంటర్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చిత్రపటాలను దహనం చేశారు. మోత్కూర్‌లో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. నూతనకల్‌లో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు. జనసమీకరణకు అర్వపల్లిలో జేఏసీ, జానపద కళాకారుల సమావేశాలు జరిగాయి. -
సకల జనభేరికి భారీగా ఆదిలాబాద్ తెలంగాణవాదులు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్లో ఆదివారం నిర్వహించే సకల జనభేరికి భారీగా తరలివెళ్లేందుకు తెలంగాణవాదులు సన్నద్ధమయ్యారు. పార్లమెంటులో ప్రత్యేక తెలంగాణ బిల్లు పెట్టేందుకు కేంద్రంపై ఒత్తిడి తె చ్చే ప్రయత్నాల్లో భాగంగా నిర్వహించే జనభేరికి భారీగా జిల్లా నుంచి తరలనున్నారు. రాజకీయ జేఏసీ, ఉద్యోగ సంఘాల జేఏసీలతోపాటు ప్రత్యేక తెలంగాణ కోరుకునే రాజకీయ పార్టీలన్నీ జనసమీకరణలో నిమగ్నమయ్యాయి. సకల జనభేరి నేపథ్యంలో వారం రోజులుగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి జేఏసీలతోపాటు వివిధ రాజకీయ పార్టీలు జిల్లా వ్యాప్తంగా సన్నాహక సమావేశాలు నిర్వహించాయి. కరపత్రాలు, వాల్‌పోస్టర్ల ఆవిష్కరణతోపాటు జనభేరిని సక్సెస్ చేయాలంటూ విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు కొనసాగించాయి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఉట్నూర్, ఆసిఫాబాద్, ముథోల్, కాగజ్‌నగర్, బెల్లంపల్లి, చెన్నూర్ తదితర నియోజకవర్గాలతోపాటు జిల్లా వ్యాప్తంగా సుమారుగా 25 వేల మందికి తగ్గకుండా తరలించేందుకు ఆర్టీసీ బస్సులు, రైళ్లతోపాటు ప్రైవేట్ వాహనాలను సిద్ధం చేశారు. సీఎం దిష్టిబొమ్మలు దహనం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్రం ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్న క్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విభజనను అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలపై జిల్లావాసులు భగ్గుమన్నారు. ఈ సందర్భంగా శని వారం జిల్లావ్యాప్తంగా సీఎం దిష్టిబొమ్మలను ద హనం చేశారు. ముఖ్యమంత్రి పిచ్చిపట్టి తెలంగాణ అంశంపై అనాలోచితంగా మాట్లాడుతున్నారని సీపీఐ శాసనసభా పక్షనేత, ఎమ్మెల్యే గుండా మల్లేశ్ బెల్లంపల్లిలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమంపై అవగాహన లేకుండా మాట్లాడ్డం శోచనీయమని మంచిర్యాల ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి విమర్శించారు. తెలంగాణ పట్ల సీఎం అవలంబిస్తు న్న వైఖరి సిగ్గు చేటని టీఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి ఆదిలాబాద్‌లో వి లేకరుల సమావేశంలో విమర్శించారు. 13 జిల్లా ల సీఎంగా వ్యవహరిస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలని రాజకీయ జేఏసీ తూర్పు జిల్లా చైర్మన్ గోనె శ్యాంసుందర్‌రావు, కన్వీనర్ రవీందర్రావు డిమాండ్ చేశారు. మంచిర్యాలలో సకల జనభేరి ప్రచార పోస్టర్‌ను విడుదల చేసి మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే జలయుద్ధం జరుగుతుందని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కన్వీనర్, కో కన్వీనర్ డిమాండ్ చేశారు. సకల జనభేరికి అటవీశాఖ ఉద్యోగులు తరలిరావాలని మినిస్టీరియల్ ఫారెస్ట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పిలుపునిచ్చారు. కాగా సీఎం వ్యాఖ్యలకు నిరసనగా దండేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల సీఎం దిష్టిబొమ్మలను దహనం చేయగా, లక్సెట్టిపేట ఐబీ నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు ఉద్యోగ, ఉపాధ్యాయ అవుట్ సోర్సింగ్ సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వాంకిడి, రెబ్బెన, జైనూర్ మండలాల్లో జేఏసీ ఆద్వర్యంలో రాష్ట్రీ య రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మార్మోగిన తెలం‘గానం’... ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించే సకల జనభేరిని సక్సెస్ చేసేందుకు భారీ జనసమీకరణ కోసం శనివారం జిల్లావ్యాప్తంగా నిర్వహిం చిన సన్నాహక సమావేశాలు, ర్యాలీలతో తెలం‘గానం’ మార్మోగింది. ఆదిలాబాద్, మంచిర్యా ల, నిర్మల్, ఉట్నూర్, ఆసిఫాబాద్ రెవెన్యూ డివి జన్ల పరిధిలోని పలు మండలాలు, గ్రామాల్లో ప్రచార ర్యాలీలు జరిగాయి. సకల జనుల భేరీకి జిల్లా వాసులు ప్రభంజనంలా తరలిరావాలని తాండూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. సకల జనభేరిని విజయవంతం చేయాలని ఖానాపూర్ టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట సత్యం, ప్ర ధాన కార్యదర్శి గంగాధర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. జన్నారం మండలంలో కార్యక్రమం విజయవంతం చేయాలని టీఆర్ఎస్, టీఆర్ఎస్వీల నాయకులు సత్యం, భరత్ వేర్వేరుగా విలేకరుల సమావేశాలు ఏర్పాటుచేశారు. ఇంద్రవెల్లి మండలంలో టీఆర్టీయూ సంఘం మండల అధ్యక్షుడు అంబాజీ ఆధ్వర్యంలో సకల జనభేరి పోస్టర్లు విడుదల చేశారు. ఏదిఏమైనా.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా హైదరాబాద్‌కు తరలేందుకు సన్నద్ధమయ్యారు. -
‘సకల’ సన్నాహాలు
సాక్షి, సిటీబ్యూరో: మధ్య మండలంలోని నిజాం కాలేజీ మైదానంలో ఆదివారం టీజాక్ నేతలు తలపెట్టిన సకల జనుల భేరీకి నగర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. గ్రౌండ్స్‌తోపాటు దాని చుట్టూ, పరిసర ప్రాంతాల్లో దాదాపు 3 వేల మంది పోలీసుల్ని మోహరించనున్నారు. బందోబస్తు, భద్రత విధుల్లో నగర పోలీసులతో పాటు కేంద్ర, రాష్ట్ర బలగాలు పాలు పంచుకోనున్నాయి. నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ ఆదేశాల మేరకు మధ్య మండల డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డి బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. ఈ సభ నేపథ్యంలో కళాశాల చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9 వరకు ఇవి అమలులో ఉంటాయి. తాజ్ మహల్ జంక్షన్, బొగ్గులకుంట వైపు నుంచి బషీర్‌బాగ్ చౌరస్తా వైపు వచ్చే వాహనాలను కింగ్ కోఠి చౌరస్తా నుంచి ఈడెన్ గార్డెన్ జంక్షన్ వైపు పంపిస్తారు అంబేద్కర్ విగ్రహం వైపు నుంచి బషీర్‌బాగ్ చౌరస్తా వైపు వచ్చే వాహనాలను లిబర్టీ జంక్షన్ నుంచి హిమాయత్‌నగర్ ‘వై’ జంక్షన్ వైపు పంపిస్తారు ఈడెన్ గార్డెన్ జంక్షన్ వైపు నుంచి వచ్చే వాహనాలను కింగ్ కోఠి చౌరస్తా నుంచి తాజ్ మహల్ జంక్షన్, బొగ్గులకుంట వైపు మళ్లిస్తారు సిమెట్రీ జంక్షన్ నుంచి బషీర్‌బాగ్ చౌరస్తా వైపు వచ్చే వాహనాలను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి హిమాయత్‌నగర్ ‘వై’ జంక్షన్ వైపు పంపిస్తారు నారాయణగూడ చౌరస్తా నుంచి బషీర్‌బాగ్ చౌరస్తా వైపు వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్ ‘వై’ జంక్షన్ నుంచి లిబర్టీ వైపు మళ్లిస్తారు రవీంద్రభారతి, నాంపల్లి వైపు నుంచి వచ్చే వాహనాలను పీసీఆర్, ఏఆర్ పెట్రోల్‌పంప్ నుంచి బషీర్‌బాగ్ చౌరస్తా వైపు అనుమతించరు చర్మాస్ నుంచి బషీర్‌బాగ్ చౌరస్తాకు వచ్చే వాహనాలను ఎస్బీహెచ్ జంక్షన్ నుంచి సుజాత హైస్కూల్ వైపు పంపిస్తారు బహీర్ కేఫ్ వైపు నుంచి నిజాం కాలేజ్ గేట్ నెం.3, 4 వైపు వచ్చే వాహనాలను ఎన్సీసీ లైన్ నుంచి కోఠి చౌరస్తా వైపు పంపిస్తారు