హైదరాబాద్, న్యూస్‌లైన్: క్రైస్తవులు, మైనార్టీలు, దళితుల శ్రేయస్సు లక్ష్యంతో ‘ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ’ ఆవిర్భవించింది. శుక్రవారం హైదరాబాద్‌లోని నిజాం కళాశాల మైదానంలో ఆ పార్టీ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండా, గుర్తు, కండువాలను ఆవిష్కరించారు. సభకు పలు జిల్లాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
బీహార్ రాజ్యసభ సభ్యుడు అలీ అన్వర్ అన్సారీ, ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్‌పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎం.ఉదయ్‌కుమార్, జాతీయ ప్రధాన కార్యదర్శి పాల్ దేవప్రియం పుల్లా, హైదరాబాద్ మేయర్ మాజీద్ హుస్సేన్, కంచె ఐలయ్య, సిక్కు కమ్యూనిటీ ప్రతినిధి విశ్రాంత, సామాజిక తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ పలువురు బిషప్‌లు పాల్గొన్నారు. సాధారణ ఎన్నికల్లో తమ పార్టీకి బూర గుర్తును ఎన్నికల కమిషన్ కేటాయించినట్లు తెలిపారు.
ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ ఆవిర్భావం
Published Sat, Feb 22 2014 2:09 AM | Last Updated on Sat, Sep 2 2017 3:57 AM
Advertisement
Advertisement