సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుతగులుతున్న నేతల బండారాన్ని బట్టబయలుచేసేందుకు ఉద్దేశించిన ‘సకల జనభేరి’కి జిల్లా సన్నద్ధమైంది. గడిచిన వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా వివిధ రూపాల్లో సన్నాహక కార్యక్రమాలు జరిగాయి. పొలిటికల్ జేఏసీ పిలుపుతో చేపట్టిన ఈ సభ హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ గ్రౌండ్‌లో ఆదివారం మధ్యాహ్నం నుంచి జరగనుంది. ఈ భేరిని విజయవంతం చేసేందుకు ఇప్పటికే ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాలు, విద్యార్థులు, వివిధ జేఏసీలు ర్యాలీలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సులు నిర్వహించాయి.
పొలిటికల్ జేఏసీ నేతృత్వంలో ఆయా జేఏసీలు పాల్గొనగా సన్నాహక కార్యక్రమాలన్నీ విజయవంతమయ్యాయి. శనివారం జిల్లా వ్యాప్తంగా బైక్ ర్యాలీలు జరిగాయి. సకల జనభేరిని విజయవంతం చేయాలని కోరుతూ సూర్యాపేటలో జేఏసీ నేతల ఆధ్వర్యంలో మాక్-వాక్ నిర్వహించారు. సీపీఐ కూడా భేరిలో పాల్గొంటుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ నల్లగొండలో ప్రకటించారు. టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీలు ఇప్పటికే జనభేరికి జన సమీకరణలో ఉన్నాయి.
సమావేశాలు, ర్యాలీలు..
మిర్యాలగూడలో గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం సమావేశం నిర్వహించింది. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మిర్యాలగూడలో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. వేములపల్లిలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సకల జనభేరి వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. సూర్యాపేట పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ జరపగా, తెలంగాణ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు.
పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. చివ్వెంల మండల కేంద్రంలో డీటీఎఫ్ ఆధ్వర్యంలో సమావేశం జరి పారు. భూదాన్ పోచంపల్లిలో పోస్టర్ ఆవిష్కరించారు. భువనగిరిలో అరగుండు, అర మీసంతో వచ్చిన గాంధీనాయక్‌కు సన్మానం చేశారు. ఆలేరులో సీపీఐ (ఎంఎల్) న్యూడెమాక్రసీ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు. యాదగిరిగుట్టలో టీఎన్‌జీఓలు సమావేశం నిర్వహించారు. చౌటుప్పల్‌లో కళాశాలల విద్యార్థులతో హైవేపై ర్యాలీ నిర్వహించారు. పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సమావేశమయ్యారు. సకలజన భేరికి ఉపాధ్యాయులంతా తరలివెళ్లాలని నిర్ణయించారు. మునుగోడులో బీజేపీ నాయకులు సమావేశం నిర్వహించారు. దేవరకొండలో టీఆర్‌ఎస్ నేతలు హైదరాబాద్‌కు తరలి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గం నుంచి కనీసం వెయ్యి మందిని తరలించడానికి సం బంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. టీఎన్‌జీఓస్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులను తరలివెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
నాగార్జునసాగర్ ని యోజకరవర్గంలో హాలియా, పెద్దవూర, గుర్రంపోడు మండలాల్లో టీఆర్‌ఎస్, జేఏసీ నాయకులు సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ముఖ్యమంత్రి తీరును విమర్శిం చారు. హుజూర్‌నగర్‌లో జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాసెంటర్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చిత్రపటాలను దహనం చేశారు. మోత్కూర్‌లో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. నూతనకల్‌లో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు. జనసమీకరణకు అర్వపల్లిలో జేఏసీ, జానపద కళాకారుల సమావేశాలు జరిగాయి.
సకలం.. సన్నద్ధం
Published Sun, Sep 29 2013 4:25 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement