సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్‌లో ఆదివారం నిర్వహించే సకల జనభేరికి భారీగా తరలివెళ్లేందుకు తెలంగాణవాదులు సన్నద్ధమయ్యారు. పార్లమెంటులో ప్రత్యేక తెలంగాణ బిల్లు పెట్టేందుకు కేంద్రంపై ఒత్తిడి తె చ్చే ప్రయత్నాల్లో భాగంగా నిర్వహించే జనభేరికి భారీగా జిల్లా నుంచి తరలనున్నారు. రాజకీయ జేఏసీ, ఉద్యోగ సంఘాల జేఏసీలతోపాటు ప్రత్యేక తెలంగాణ కోరుకునే రాజకీయ పార్టీలన్నీ జనసమీకరణలో నిమగ్నమయ్యాయి. సకల జనభేరి నేపథ్యంలో వారం రోజులుగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి జేఏసీలతోపాటు వివిధ రాజకీయ పార్టీలు జిల్లా వ్యాప్తంగా సన్నాహక సమావేశాలు నిర్వహించాయి. కరపత్రాలు, వాల్‌పోస్టర్ల ఆవిష్కరణతోపాటు జనభేరిని సక్సెస్ చేయాలంటూ విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు కొనసాగించాయి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఉట్నూర్, ఆసిఫాబాద్, ముథోల్, కాగజ్‌నగర్, బెల్లంపల్లి, చెన్నూర్ తదితర నియోజకవర్గాలతోపాటు జిల్లా వ్యాప్తంగా సుమారుగా 25 వేల మందికి తగ్గకుండా తరలించేందుకు ఆర్టీసీ బస్సులు, రైళ్లతోపాటు ప్రైవేట్ వాహనాలను సిద్ధం చేశారు.
సీఎం దిష్టిబొమ్మలు దహనం
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్రం ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్న క్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విభజనను అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలపై జిల్లావాసులు భగ్గుమన్నారు. ఈ సందర్భంగా శని వారం జిల్లావ్యాప్తంగా సీఎం దిష్టిబొమ్మలను ద హనం చేశారు. ముఖ్యమంత్రి పిచ్చిపట్టి తెలంగాణ అంశంపై అనాలోచితంగా మాట్లాడుతున్నారని సీపీఐ శాసనసభా పక్షనేత, ఎమ్మెల్యే గుండా మల్లేశ్ బెల్లంపల్లిలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమంపై అవగాహన లేకుండా మాట్లాడ్డం శోచనీయమని మంచిర్యాల ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి విమర్శించారు. తెలంగాణ పట్ల సీఎం అవలంబిస్తు న్న వైఖరి సిగ్గు చేటని టీఆర్‌ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి ఆదిలాబాద్‌లో వి లేకరుల సమావేశంలో విమర్శించారు. 13 జిల్లా ల సీఎంగా వ్యవహరిస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలని రాజకీయ జేఏసీ తూర్పు జిల్లా చైర్మన్ గోనె శ్యాంసుందర్‌రావు, కన్వీనర్ రవీందర్‌రావు డిమాండ్ చేశారు. మంచిర్యాలలో సకల జనభేరి ప్రచార పోస్టర్‌ను విడుదల చేసి మాట్లాడారు.
ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే జలయుద్ధం జరుగుతుందని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కన్వీనర్, కో కన్వీనర్ డిమాండ్ చేశారు. సకల జనభేరికి అటవీశాఖ ఉద్యోగులు తరలిరావాలని మినిస్టీరియల్ ఫారెస్ట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పిలుపునిచ్చారు. కాగా సీఎం వ్యాఖ్యలకు నిరసనగా దండేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల సీఎం దిష్టిబొమ్మలను దహనం చేయగా, లక్సెట్టిపేట ఐబీ నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు ఉద్యోగ, ఉపాధ్యాయ అవుట్ సోర్సింగ్ సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వాంకిడి, రెబ్బెన, జైనూర్ మండలాల్లో జేఏసీ ఆద్వర్యంలో రాష్ట్రీ య రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
మార్మోగిన తెలం‘గానం’...
ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించే సకల జనభేరిని సక్సెస్ చేసేందుకు భారీ జనసమీకరణ కోసం శనివారం జిల్లావ్యాప్తంగా నిర్వహిం చిన సన్నాహక సమావేశాలు, ర్యాలీలతో తెలం‘గానం’ మార్మోగింది. ఆదిలాబాద్, మంచిర్యా ల, నిర్మల్, ఉట్నూర్, ఆసిఫాబాద్ రెవెన్యూ డివి జన్ల పరిధిలోని పలు మండలాలు, గ్రామాల్లో ప్రచార ర్యాలీలు జరిగాయి. సకల జనుల భేరీకి జిల్లా వాసులు ప్రభంజనంలా తరలిరావాలని తాండూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో టీఆర్‌ఎస్ నాయకులు పిలుపునిచ్చారు.
సకల జనభేరిని విజయవంతం చేయాలని ఖానాపూర్ టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తోట సత్యం, ప్ర ధాన కార్యదర్శి గంగాధర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. జన్నారం మండలంలో కార్యక్రమం విజయవంతం చేయాలని టీఆర్‌ఎస్, టీఆర్‌ఎస్వీల నాయకులు సత్యం, భరత్ వేర్వేరుగా విలేకరుల సమావేశాలు ఏర్పాటుచేశారు. ఇంద్రవెల్లి మండలంలో టీఆర్‌టీయూ సంఘం మండల అధ్యక్షుడు అంబాజీ ఆధ్వర్యంలో సకల జనభేరి పోస్టర్లు విడుదల చేశారు. ఏదిఏమైనా.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా హైదరాబాద్‌కు తరలేందుకు సన్నద్ధమయ్యారు.
సకల జనభేరికి భారీగా ఆదిలాబాద్ తెలంగాణవాదులు
Published Sun, Sep 29 2013 4:08 AM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM
Advertisement