
డీఎస్పీలు, అదనపు ఎస్పీల బదిలీలకు రంగం సిద్ధం
రాష్ట్రంలో మరోసారి భారీ ఎత్తున డీఎస్పీలు, అదనపు ఎస్పీల బదిలీలకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన కసరత్తును రాష్ట్ర పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డు చైర్మన్ అనురాగ్‌శర్మ పూర్తి చేసినట్లు సమాచారం.
హైదరాబాద్: రాష్ట్రంలో మరోసారి భారీ ఎత్తున డీఎస్పీలు, అదనపు ఎస్పీల బదిలీలకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన కసరత్తును రాష్ట్ర పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డు చైర్మన్ అనురాగ్‌శర్మ పూర్తి చేసినట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఈ వారంలోనే ఉత్తర్వులను జారీ చేయడానికి పోలీసు అధికారులు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధితోపాటు, తొమ్మిది జిల్లాల్లోని డీఎస్పీలు, అదనపు ఎస్పీలలో పలువురికి స్థానచలనం కలుగనున్నట్టు తెలిసింది.
ఇదిలా ఉండగా బదిలీల్లో రాజకీయ జోక్యం లేకుండా, పారదర్శకంగా జరిగేలా చూస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పలుమార్లు తెలిపినప్పటికీ అధికారపక్షానికి చెందిన నాయకులు, కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి పోలీసు అధికారులపై ఒత్తిడులు వస్తున్నట్టు సమాచారం.