
అసెంబ్లీకి 2కి.మీ పరిధిలో ఆంక్షలు : సీపీ
శాసనసభ శీతాకాల సమావేశాలు సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు.
హైదరాబాద్ : శాసనసభ శీతాకాల సమావేశాలు సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. అసెంబ్లీకి రెండు కిలోమీటర్ల పరిధి వరకూ ఆంక్షలు విధించినట్లు ఆయన మంగళవారమిక్కడ చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఏపీ ఎన్జీవోల అసెంబ్లీ ముట్టడిపై సమాచారం లేదని ఆయన తెలిపారు. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. ప్రత్యేక ఫోర్స్తో భద్రతను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.