
చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు:అనురాగ్ శర్మ
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని నగర కమీషనర్ అనురాగ్ శర్మ స్పష్టం చేశారు.
హైదరాబాద్:మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని నగర కమీషనర్ అనురాగ్ శర్మ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. చట్టాన్ని ఎవరైనా చేతిల్లోకి తీసుకోవాలని ప్రయత్నిస్తే తాము కఠినంగానే వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాలు ఏర్పాటు చేయకూడదని సీపీ తెలిపారు. ఎవరికైనా అభ్యంతరాలుంటే పోలీసుల దృష్టికి తీసుకురావచ్చన్నారు.
అభ్యర్థులు పర్యటించే ప్రాంతాల వివరాలను ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. ప్రార్ధన మందిరాల సమీపంలో ప్రచారానికి నిషేధాజ్ఞలున్నట్లుఅనురాగ్ శర్మ తెలిపారు. మతాల ఆధారంగా ఎవరూ ప్రచారం చేయకూడదన్నారు. డబ్బు, మద్యం పంపిణీలకు సంబంధించి కఠినంగా వ్యవహరిస్తామన్నారు.