సమాజానికి 24 గంటలు సేవ చేసేవారే పోలీసులు
హైదరాబాద్ : సమాజానికి 24 గంటలు సేవ చేసేవారే పోలీసులు అని నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన ఓపెన్ హౌస్ కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ హాజరయ్యారు.విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అమరవీరులకు ఆయన నివాళులు అర్పించారు.
అనంతరం అనురాగ్ శర్మ మాట్లాడుతూ ఈ ఏడాది దేశవ్యాప్తంగా 576మంది పోలీసులు వివిధ సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయారన్నారు. వారి త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. శత్రువులతో పోరాడి అమరులు అవుతున్న సైనికులకు లభిస్తున్న గుర్తింపు ...విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు లభించటం లేదన్నారు.