
'నిమిషం ఆలస్యమైనా అనుమతికి నో'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఎస్సై రాత పరీక్ష కోసం డీజీపీ అనురాగ్ శర్మ 'ఫైండ్ మి' యాప్ను ప్రారంభించారు. అభ్యర్థి వివరాలు, పరీక్ష కేంద్ర సమాచారం, రూట్ మ్యాప్ ఈ యాప్ ద్వారా తెలుసుకునే వీలుంటుంది.
ఈ యాప్ ప్రారంభించిన సందర్భంగా అనురాగ్ శర్మ మాట్లాడుతూ పరీక్షకు ఒక నిమిషం ఆలస్యం అయినా అనుమతి ఇవ్వడం జరగదని చెప్పారు. 500 ఎస్సై పోస్టుల కోసం లక్షా 86వేల మంది పోటీలో ఉన్నారని చెప్పారు. స్మార్ట్ ఫోన్లు లేని వారు వే టు ఎస్సెమ్మెస్ 9222273310 నెంబర్ ద్వారా సమాచారం పొందవచ్చని అన్నారు.