గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సమన్వయంతో పనిచేద్దామని గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులతో నగర పోలీసుకమిషనర్ అనురాగ్‌శర్మ అన్నారు.
సాక్షి,సిటీబ్యూరో: గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సమన్వయంతో పనిచేద్దామని గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులతో నగర పోలీసుకమిషనర్ అనురాగ్‌శర్మ అన్నారు. నగరంలోని అన్నిజోన్ల కమిటీల ప్రతినిధులతో గురువారం కమిషనరేట్‌లో ఆయన భేటీ అయ్యారు. అదనపు కమిషనర్లు అంజనీకుమార్ (శాంతిభద్రతలు),అమిత్‌గార్గ్ (ట్రాఫిక్)లతోపాటు సంయుక్త కమిషనర్ బి.మల్లారెడ్డి (ఎస్‌బీ), కమిషనరేట్ పరిధిలోని ఇతర ఉన్నతాధికారులు, ఐదుజోన్ల డీసీపీలు, 50మంది ఉత్సవ కమిటీ ప్రతినిధులు సమావేశానికి హాజ రయ్యారు.
ఉత్సవ నిర్వాహకులకు పోలీ సులు అన్ని సహాయసహకారాలు అందిస్తారని, ఆ మేరకు ఆదేశాలు కూడా జారీచేశామని కొత్వాల్ స్పష్టం చేశారు. నిర్వాహకులు కూడా శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని కమిషనర్ కోరారు. నిమజ్జనం ఊరేగింపును నిర్దేశించిన సమయంలోనే ప్రారంభించి తుదిఘట్టం ప్రశాంతంగా,ప్రణాళిక ప్రకారం పూర్తయ్యేందుకు సహకరించాలని అనురాగ్‌శర్మ పేర్కొన్నారు. ఊరేగింపునకు అవసరమైన లారీలతో సహా ఇతర అన్ని వసతుల్నీ ముందే సమకూర్చుకోవాలని కమిషనర్ సూచిం చారు.
ఈసందర్భంగా ఉత్సవ కమిటీ ప్రతినిధులు తమ సమస్యల్ని కొత్వాల్‌కు వివరించారు. మండపాల వద్ద జరిగే సాంసృ్కతిక కార్యక్రమాలను రాత్రి వరకు అనుమతించాలని, మధ్యలో పోలీసులు జోక్యం చేసుకుని ఇబ్బందులు కలిగించవద్దని కోరారు. అనేక రహదారులు అధ్వానంగా మారిన నేపథ్యంలో నిమజ్జనం రోజు విగ్రహాలతో ఊగేరింపుగా వచ్చే వాహనాలు అనేక ఇబ్బం దులు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు. దీనికి సానుకూలంగా స్పంది ంచిన కమిషనర్ అనురాగ్‌శర్మ విషయాన్ని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తామని, నిమజ్జనం నాటికి కీలక రహదారుల మరమ్మతులు పూర్తయ్యేలా ప్రయత్నిస్తామని హామీఇచ్చారు.