ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా సచివాలయానికి చుట్టూ 500 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా సచివాలయానికి చుట్టూ 500 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం ఉదయం 6 నుంచి నవంబర్ 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఇవి అమలులో ఉంటాయని, అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ ఉత్తర్వుల ప్రకారం బహిరంగ సభల నిర్వహణ, నలుగురికంటే ఎక్కువ మంది ఓ చోట గుమిగూడటం, నిషేధ వస్తువులతోపాటు కర్రలు తదితరాలు కలిగి ఉండటం, బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించడం, ఉపన్యాసాలు ఇవ్వడం, నినాదాలు చేయడం, ఊరేగింపులు నిర్వహించడం, ధర్నాలు, పికెటింగ్‌లు.. వంటివి నిషిద్ధం.