అంతా ఏసీబీనే చూసుకుంటుంది: డీజీపీ
వరంగల్ : ఓటుకు కోట్లు కేసు విచారణ చట్టప్రకారమే జరుగుతోందని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు. ఆయన సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో అన్ని అంశాలు ఏసీబీనే చూసుకుంటుందన్నారు. చంద్రబాబు నాయుడుకు నోటీసులు ఇస్తారా అన్న విలేకర్ల ప్రశ్నకు డీజీపీ పైవిధంగా సమాధారం ఇచ్చారు. కాగా ఈ కేసుకు సంబంధించి ఆడియో, వీడియో టేపులపై త్వరలో ఫోరెన్సిక్ నివేదిక రానుంది. ఎమ్మెల్యే స్టీఫెన్ సన్తో ఫోన్ మాట్లాడింది చంద్రబాబు నాయుడా కాదా, అనేది తేలనుంది. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ నుంచి నివేదిక అందిన తర్వాతే పూర్తి ఆధారాలతోనే ఏసీబీ తన విచారణను మరింత ముమ్మరం చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.