
వి.శ్రీనివాసన్
ఆలిండియా బీఎస్‌ఎన్‌ఎల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నేటి నుంచి నిర్వహించనున్నారు. మంగళవారం నుంచి 10వ తేదీ వరకు నాలుగు రోజుల ఈ టోర్నీ జరగనుందని బీఎస్‌ఎన్‌ఎల్ సీజీఎం వి.శ్రీనివాసన్ తెలిపారు.
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఆలిండియా బీఎస్‌ఎన్‌ఎల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నేటి నుంచి నిర్వహించనున్నారు. మంగళవారం నుంచి 10వ తేదీ వరకు నాలుగు రోజుల ఈ టోర్నీ జరగనుందని బీఎస్‌ఎన్‌ఎల్ సీజీఎం వి.శ్రీనివాసన్ తెలిపారు. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఈవెంట్ జరుగుతుంది. ఈ పోటీల్లో రాష్ట్ర బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులతోపాటు అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, కేరళ, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులు పాల్గొంటారని సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. నగర పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మ ముఖ్యఅతిథిగా విచ్చేసి టోర్నీని ప్రారంభిస్తారని ఆయన చెప్పారు.