
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అమలు చేస్తు న్న ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానానికి 60 మా ర్కులు వేస్తానని, ఈ విసయంలో ఇంకా 40 శాతం పురోగతి సాధించాల్సి ఉందని డీజీపీ అనురాగ్‌శర్మ అభిప్రాయపడ్డారు. ఆదివారం పదవీవిరమణ చేయనున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఏర్పా టు చేసిన మీట్ ది ప్రెస్‌లో పాల్గొ న్నారు.
ఈ సందర్భంగా అనురాగ్‌శర్మ మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది కేవలం ఉన్నతాధికారులు, ఐపీఎస్‌లు పాటి స్తే వచ్చేది కాదని, కింది స్థాయిలో పనిచేసే కానిస్టేబుళ్లు, ఎస్సై ల నుంచి రావాల్సి ఉంటుందన్నారు. ఈ విధానం నూరు శాతం విజయవంతమయ్యేందుకు దశలవారీగా కార్యచరణ రూపొందించుకోవాల్సి ఉందన్నారు.
మావోయిస్టు ప్రాబల్యం పెరగదు...
రాష్ట్రం ఏర్పడితే మావోయిస్టు ప్రాబల్యం పెరుగుతుందని వచ్చిన వార్తలకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా వ్యూహాత్మకంగా పనిచేశామని అనురాగ్‌శర్మ చెప్పారు. విభజన సమయంలో కేవలం 29 మంది ఐపీఎస్ అధికారులతో విభాగాలను ఏడాదిపాటు నెట్టుకొచ్చామని, అయినా ఎక్కడా అవాంఛనీయ సంఘటనలేవీ లేకుండా టీంవర్క్‌తో విజ యం సాధించామన్నారు.
తాను మూడున్నరేళ్లపాటు డీజీపీగా సక్సెస్ అవడం వెనుక హోంగార్డుల నుంచి ఐపీఎస్‌ల దాకా అందరి కృషి ఉందని, ఇది మొత్తం పోలీస్‌శాఖ గొప్పతనమన్నారు. రాష్ట్రంలో మావోయిస్టు ప్రాబల్యం పెరుగుతుందా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా అలాంటి అవకాశాలు ఏమాత్రం లేవని స్పష్టం చేశారు.
మిగతా రాష్ట్రాలకన్నా మిన్న
35 ఏళ్ల సర్వీసులో చాలా చోట్ల పనిచేశానని, అన్ని చోట్లా తనకు సంతృప్తికరంగా అనిపిం చిందన్నారు. సర్వీసులోకి రాకముందు మూడేళ్లపాటు అటవీశాఖలో పనిచేశానని తెలిపారు. ప్రతి కానిస్టేబుల్‌కు టెక్నాలజీపై పట్టు ఉండేలా ట్యాబ్‌లు ఇస్తున్నామని, దీనివల్ల అంకితభావ సేవలు ప్రజలకు అందేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి ఇచ్చిన తోడ్పాటుతో మిగతా రాష్ట్రాలకన్నా తెలంగాణ పోలీస్ 100 శాతం అద్బుతమైన పనితీరును ప్రదర్శించిందని, ఇకపైనా కొనసాగిస్తుందన్న నమ్మకం తనకుందన్నారు.
తన విజయంలో మీడియా ప్రధాన పాత్ర పోషించిందని, ప్రతి చిన్న సమాచారాన్ని తనతో మీడియా ప్రతినిధులు పంచుకున్నారని, రాష్ట్రానికి ఇబ్బంది తెచ్చే విషయాలను సైతం తనకు చెప్పి నియంత్రణ చర్యలు తీసుకోవడంలో కృషి చేశారని ఆయన కితాబునిచ్చారు. పదవీ విరమణ చేయనున్న అనురాగ్ శర్మను హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు రాజమౌళిచారి, విజయ్‌కుమార్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment