సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖకు జీవిత బీమాకు సంబంధించి కోటి 90 లక్షల 93 వేల రూపాయలను మంజూరు చేస్తు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తాన్ని న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీకి చెల్లించేలా రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మకు ఆదేశాలు ఇచ్చారు.
పోలీస్‌శాఖలోని కానిస్టేబుల్ మొదలుకుని ఐపీఎస్ అధికారుల వరకు, రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర భద్రతా దళాల సిబ్బంది, అధికారులకు కూడా ఈ ఇన్సూరెన్సు వర్తించేలా ఆదేశాలు ఇచ్చారు. అంతకు ముందు పోలీసు శాఖలోని సిబ్బంది, అధికారులకు బీమాను వర్తింపజేస్తు దానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని కోరుతూ డీజీపీ అనురాగ్‌శర్మ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. దీనిని పరిశీలించిన ప్రభుత్వం ఈ మేరకు నిధులను మంజూరు చేసింది.
టీ పోలీసు శాఖకు బీమా నిధులు మంజూరు
Published Sat, Dec 20 2014 6:04 AM | Last Updated on Sat, Sep 2 2017 6:29 PM
Advertisement
Advertisement