అందరి సహకారంతో ‘బెస్ట్‌’గా నిలిచాం | DGP Anurag Sharma comments in twitter | Sakshi
Sakshi News home page

అందరి సహకారంతో ‘బెస్ట్‌’గా నిలిచాం

Published Sun, Nov 12 2017 2:29 AM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

 DGP Anurag Sharma comments in twitter - Sakshi

శనివారం హైదరాబాద్‌లో పోలీసు అధికారులు రూపొందించిన ‘ఫ్రెండ్స్‌ ఇన్‌ యూనిఫాం’ టేబుల్‌ బుక్‌ను ఆవిష్కరిస్తున్న అనురాగ్‌శర్మ

సాక్షి, హైదరాబాద్‌: ‘రాష్ట్ర పోలీసుశాఖను దేశంలోని అత్యుత్తమ పోలీసు విభాగాల్లో ఒకటిగా నిలపడంలో సహకరించిన, మద్దతు పలికిన వారందరికీ ధన్యవాదాలు’అని డీజీపీగా ఆదివారం పదవీవిరమణ చేయనున్న అనురాగ్‌శర్మ శనివారం తన అధికారి క ట్వీటర్‌ ఖాతాలో పేర్కొన్నారు. తన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వ సలహదారుగా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నూతన డీజీపీ మహేందర్‌రెడ్డికి అభినందనలు తెలుపుతూ వీడ్కోలు చెప్పారు. 

‘ఫ్రెండ్స్‌ ఇన్‌ యూనిఫాం’ ఆవిష్కరణ 
ఫ్రెండ్లీ, స్మార్ట్‌ పోలీసింగ్‌పై పోలీస్‌ అధికారులు రూపొందించిన ‘ఫ్రెండ్స్‌ ఇన్‌ యూనిఫాం’టేబుల్‌ బుక్‌ను డీజీపీ అనురాగ్‌శర్మ శనివారం ఆవిష్కరించారు. పోలీస్‌శాఖ చేపట్టిన అనేక కార్యక్రమాలను ప్రతిబింబించేలా ఫిల్మ్‌ మేకర్‌ అనితా సలూజ చిత్రీకరించిన వీడియో ఫిల్మ్‌ను కూడా ఆయన ఆవిష్కరించారు. అలాగే పోలీస్‌ సేవలపై అభినయ శ్రీనివాస్, చంద్రప్రకాశ్‌ రూపొందించిన ఆడియో అల్బమ్‌ను డీజీపీ శనివారం ఇక్కడి పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో విడుదల చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement