పోలీసు ఉద్యోగాలకు మూడేళ్ల వయో సడలింపు! | Three years age relaxation for police jobs | Sakshi
Sakshi News home page

పోలీసు ఉద్యోగాలకు మూడేళ్ల వయో సడలింపు!

Published Tue, Jun 5 2018 2:22 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM

Three years age relaxation for police jobs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పోలీసు ఉద్యోగాల వయోపరిమితి సడలింపు డిమాండ్‌పై సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది. సడలింపు ఇవ్వాలంటూ నిరుద్యో గులు నిరసనలకు దిగడం, ప్రతి మంత్రికీ వినతిపత్రాలు సమర్పించడం, డీజీపీని కూడా కలసి అవకాశం కల్పించాలని కోరడంతో ఈ విషయమై సర్కారుకు పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. అయితే గతంలో మాదిరిగా ఆరేళ్లు కాకుండా మూడేళ్ల సడలింపుపై పోలీసు శాఖలో అంతర్గతంగా చర్చ జరిగినట్లు సమాచారం.

మూడేళ్లు అవకాశం కల్పిస్తే 30 వేల మందికి అవకాశం ఉంటుందని, ఆ మేరకు ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిసింది. దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రతి పాదనలు పంపింది. 18 వేలకు పైగా పోలీస్‌ ఉద్యోగాల భర్తీకి పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిం దే. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారి నియా మకాల్లో ఆరేళ్ల పాటు వయోపరిమితి సడలింపు కల్పించగా 75 వేల మందికి పైగా అవకాశం లభించింది.

రెండు, మూడు రోజుల్లో..
బోర్డు ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్‌తో రెండు, మూడు రోజుల్లో డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇంటె లిజెన్స్‌ చీఫ్‌ నవీన్‌చంద్‌ తదితర అధికారులు చర్చించే అవకాశముందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆర్థిక శాఖ నుంచి కూడా అను మతి తీసుకోడానికి అధికారులు ప్రయత్ని స్తున్నట్లు సమాచారం. భేటీ జరిగితే 2, 3 రోజుల్లో సడలింపుపై ఉత్తర్వులు వెలువ డతాయని అధికారులు భావిస్తున్నారు. ఉత్తర్వు లొస్తే సడలింపునకు సంబంధించి సవరణ చేస్తూ నోటిఫికేషన్‌ ఇస్తామని వారు చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement