బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో బస చేసిన దేశ ప్రథమ పౌరుడు ప్రణబ్ ముఖర్జీ మంగళవారం గవర్నర్ అధికార నివాసమైన రాజ్‌భవన్‌లో జరిగే విందుకు హాజరు కానున్నారు.
సాక్షి, సిటీబ్యూరో: బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో బస చేసిన దేశ ప్రథమ పౌరుడు ప్రణబ్ ముఖర్జీ మంగళవారం గవర్నర్ అధికార నివాసమైన రాజ్‌భవన్‌లో జరిగే విందుకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ కొత్వాల్ అనురాగ్‌శర్మ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వాహనచోదకులు వీటిని దృష్టిలో పెట్టుకుని సహకరించాలని ఆయన కోరారు. పరిస్థితుల్ని బట్టి ఆ సమయాల్లో, ఆయా మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించడమో, పూర్తిగా ఆపడమో జరుగుతుందన్నారు.
రాత్రి 7.20- 8.10 మధ్య...
బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం-మల్లారెడ్డినగర్-లోతుకుంట వై జంక్షన్-ఎసీఈఎంఈ సిగ్నల్-లాల్‌బజార్ టి జంక్షన్-హోలీఫ్యామిలీ చర్చ్-తిరుమలగిరి చౌరస్తా
-ఆర్టీఏ ఆఫీస్-హనుమాన్ టెంపుల్-కార్ఖానా లా అండ్ ఆర్డర్ పోలీసుస్టేషన్-విక్రమ్‌పురిలోని ఆక్సిజన్ ఆసుపత్రి-సికింద్రాబాద్ క్లబ్ ఇన్‌గేట్-ఎన్‌సీసీ డెరైక్టరేట్ చౌరస్తా
-టివోలీ ఎక్స్ రోడ్-ప్లాజా చౌరస్తా-సీటీఓ ఫ్లైఓవర్-రసూల్‌పుర చౌరస్తా-పీఎన్‌టీ జంక్షన్-బేగంపేట ఫ్లైఓవర్-గ్రీన్‌లాండ్స్ చౌరస్తా-మొనప్ప ఐలాండ్-యశోద ఆస్పత్రి-విల్లామేరీ కళాశాల-ఎంఎంటీఎస్ స్టేషన్-రాజ్‌భవన్.
విందు పూర్తయిన తరవాత రాష్ట్రపతి తిరిగి వె ళ్లే సమయంలోనూ ఆంక్షలు అమలులో ఉంటాయి.
మళ్లింపులు ఈ ప్రాంతాల్లో..
ఏఓసీ సెంటర్ నుంచి ఎయిర్‌టెల్ వైపు వెళ్లే వాహనాలను లక్ష్మీనగర్ నుంచి జేబీఎస్ మీదుగా మళ్లిస్తారు.
అమ్ముగూడ బాలాజీనగర్, నాగదేవత దేవాలయం వైపు నుంచి లాడ్ బజార్ వైపు వచ్చే వాహనాలను అంబేద్కర్ విగ్రహం నుంచి ఆర్కే పురం వైపు పంపిస్తారు.