మెట్రో అధికారులతో డీజీపీ సమీక్ష
హైదరాబాద్ : జంట నగరాలకు త్వరలో అందుబాటులోకి రానున్న మెట్రో రైళ్లలో ప్రజలకు అన్ని విధాలుగా భద్రత కల్పిస్తామని డీజీపీ అనురాగశర్మ తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో ఆయన మెట్రో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనురాగశర్మ మాట్లాడుతూ.. మెట్రో రైల్వేస్టేషన్లలో తీసుకోవాల్సిన నేర నిరోధక చర్యలు, శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయునున్నట్లు తెలిపారు.
ప్రయాణికుల లగేజ్, ఇన్ అండ్ అవుట్, పార్కింగ్ భద్రత, ట్రాఫిక్ రెగ్యులరైజేషన్, సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాముఖ్యత ఇవ్వనున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. రైల్వే స్టేషన్లు, రైల్వే ట్రాక్లపై ఉగ్రవాద నిరోధకానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. స్టేషన్లలో డాగ్స్వ్కాడ్, పోలీస్ బలగాల ఏర్పాటుకు అయ్యే నిర్వహణ ఖర్చుపై డీజీపీ సమీక్షించారు.