
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా గురువారం మధ్యాహ్నం 1.25 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఆ దారిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మోనప్ప ఐలాండ్–వీవీ స్టాచ్యూ, పంజగుట్ట–రాజ్‌భవన్ క్వార్టర్స్ మధ్య ఉన్న మార్గాల్లో సాధారణ వాహన చోదకులను అనుమతించరు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గేట్ నెం.3–అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ మధ్య పార్కింగ్ ఏర్పాటు చేశారు. మీడియా వాహనాలకు దిల్‌కుష గెస్ట్‌హౌస్‌లో, ప్రభుత్వ వాహనాలు, ప్రముఖుల వాహనాలకు ఎంఎంటీఎస్ పార్కింగ్ లాట్‌లో పార్కింగ్ కేటాయించారు. మిగిలిన వారి వాహనాలను మెట్రో రెసిడెన్సీ–నాసర్ స్కూల్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్–వీవీ స్టాచ్యూ మధ్య మార్గంలో రోడ్డు పక్కన నిలుపుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment