హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు మంగళవారం ఘనంగా జరుగుతున్నాయి. అయితే హైదరాబాద్ నగరంలో బతుకమ్మలను బషీర్బాగ్ క్రాస్ రోడ్స్, లిబర్టీ, అంబేద్కర్ విగ్రహం... అప్పర్ ట్యాంక్ బండ్ మీదుగా ఊరేగించనున్నారు. ఈ నేపథ్యంలో కాచిగూడ, నారాయణగూడ, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి మోండా మార్కెట్ వైపు వాహనాలను ఏఆర్ పెట్రోల్ బంక్ వద్ద దారి మళ్లించనున్నారు.
అలాగే మాసబ్ ట్యాంక్, లక్డీకపూల్, అయకార్ భవన్ నుంచి వాహనాలు మళ్లిస్తారు. సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలకు... లోయర్ ట్యాంక్ బండ్, లిబర్టీ, బషీర్బాగ్ వరకు అనుమతిస్తారు. అయితే వీవీఐపీల కోసం దోబీఘాట్, స్నోవరల్డ్, బుద్దభవన్ నుంచి నల్లగుట్ట వరకు తరలించి... అక్కడ పార్కింగ్ ఏర్పాటు చేస్తారు.