నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు | traffic restrictions in hyderabad | Sakshi
Sakshi News home page

నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

Published Thu, Nov 2 2017 1:20 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

traffic restrictions in hyderabad

సాక్షి, హైదరాబాద్: గురునానక్‌ జయంతి ఉత్సవాల సందర్భంగా గురువారం నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. సిక్కులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు గౌలిగూడ, అశోక్‌బజార్‌లోని గురుద్వార గురుసింగ్‌ నుంచి ర్యాలీ బయలుదేరి ఆఫ్జల్‌గంజ్‌ టీ జంక్షన్‌, సిద్ది అంబర్‌బజార్‌, మొజంజాహి మార్కెట్‌, జాంబాగ్‌, పుత్లీబౌలి, రామమందిర్‌ గుండా శంకర్‌షేర్‌ హోటల్‌ మీదుగా గౌలిగూడ చమన్‌కు చేరుకుంటుంది.

 సుమారు వెయ్యి మందితో సాగే ఈ ర్యాలీ బందోబస్తు కోసం 3 గంటల నుంచి ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను అనుమతించరని, ఆయా ప్రాంతాల ద్వారా వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement