సింధు విజయయాత్రకు సర్వం సిద్ధం | hyderabad prepare everything for sindhu | Sakshi
Sakshi News home page

సింధు విజయయాత్రకు సర్వం సిద్ధం

Aug 21 2016 10:31 PM | Updated on Sep 4 2018 5:21 PM

సింధు విజయయాత్రకు సర్వం సిద్ధం - Sakshi

సింధు విజయయాత్రకు సర్వం సిద్ధం

బ్యాడ్మింటన్‌ స్టార్‌ ప్లేయర్‌ పీవీ సింధు సోమవారం సిటీకి రానున్నారు.

సాక్షి, సిటీబ్యూరో: రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి దేశ కీర్తిప్రతిష్టలను ఇనుమడింపచేసిన బ్యాడ్మింటన్‌ స్టార్‌ ప్లేయర్‌ పీవీ సింధు సోమవారం సిటీకి రానున్నారు. ఈ మేరకు ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు నగరం ముస్తాబైంది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి  గచ్చిబౌలి స్టేడియం వరకు సింధు విజయయాత్ర.. అనంతరం ప్రభుత్వం తరపును ఘనంగా సన్మానించనున్న నేపథ్యంలో సిటీలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

ఆర్‌జీఐ ఎయిర్‌పోర్ట్‌ నుంచి గచ్చిబౌలి స్టేడియం మార్గంలో ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని సైబరాబాద్‌ వెస్ట్‌ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్‌జీఐఏ నుంచి పీవీఎన్‌ఆర్‌తో పాటు అత్తాపూర్‌–రేతిబౌలి, టోలిచౌకి, దర్గా, ఖాజాగూడ, గచ్చిబౌలి, జీఎంసీ స్టేడియం మార్గంలో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు.

వీఐపీలు రోడ్డు నంబర్‌ 36, 100 ఫీట్‌ రోడ్డు, సైబర్‌ టవర్స్, కొత్తగూడ, బొటానికల్‌ గార్డెన్స్, మజీద్‌బండ, ఓల్డ్‌ బాంబే హైవే మార్గంలో గచ్చిబౌలి స్టేడియంకు చేరుకోవాలని సైబరాబాద్‌ వెస్ట్‌ పోలీసు కమిషనర్‌ నవీన్‌ చంద్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement