ఓయూ ఆర్ట్స్ కాలేజీ భవనం
హైదరాబాద్: నిమ్స్ అనుబంధ భవన సముదాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో బుధవారం ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటలకు నిర్ణీత ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతాయని నగర అడిషనల్ పోలీసు కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. గ్రీన్‌ల్యాండ్ నుంచి పంజగుట్ట వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఈ క్రమంలో గ్రీన్‌ల్యాండ్, సోమాజీగూడ రాజీవ్ గాంధీ చౌరస్తా, రాజ్‌భవన్ రోడ్, పీవీ విగ్రహం నుంచి కేసీసీ జంక్షన్, నిమ్స్ మీదుగా పంజాగుట్ట వరకు, పంజగుట్ట నుంచి నాగార్జున సర్కిల్, బంజారాహిల్స్ రోడ్ నెం.1లోని నిమ్స్ బ్యాక్ గేట్, తాజ్ కృష్ణా, కేసీపీ జంక్షన్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment