నేడు రాష్ట్రపతి రాక.. గచ్చిబౌలిలో ట్రాఫిక్‌ ఆంక్షలు | - | Sakshi

నేడు రాష్ట్రపతి రాక.. గచ్చిబౌలిలో ట్రాఫిక్‌ ఆంక్షలు

Jul 4 2023 7:22 AM | Updated on Jul 4 2023 8:00 AM

- - Sakshi

అల్లూరి సీతారామరాజు 125 జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు మంగళవారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. ఈ నేపథ్యంలో గచ్చిబౌలి స్టేడియం పరిధిలోని ప్రధాన రోడ్లపై ట్రాఫిక్‌ ఆంక్షలు విధించినట్లు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌ నారాయణ్‌నాయక్‌ సోమవారం తెలిపారు.

మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వరకు, విప్రో సర్కిల్‌ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు, గచ్చిబౌలి కూడలి నుంచి స్టేడియం వరకు ఉన్న రోడ్లపై ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని, ఇందుకోసం వాహనదారులంతా ప్రత్యామ్నాయ మార్గాలలో రాకపోకలు సాగించాలని ఆయన సూచించారు. పోలీసులకు వాహనదారులంతా సహకరించాలని ఆయన కోరారు. –గచ్చిబౌలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement