ప్రార్థనలకు ట్రాఫిక్ మళ్లింపు | traffic restrictions in hyderabad due to ramzan, says mahendarreddy | Sakshi
Sakshi News home page

ప్రార్థనలకు ట్రాఫిక్ మళ్లింపు

Published Thu, Jul 16 2015 1:55 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

traffic restrictions in hyderabad due to ramzan, says mahendarreddy

సాక్షి, సిటీబ్యూరో: రంజాన్ నెల చివరి శుక్రవారమైన జుమా ఉల్ విదా ప్రార్థనల నేపథ్యంలో మక్కా మసీద్, సికింద్రాబాద్‌లోని జామే మసీద్‌లకు వెళ్లే రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు చార్మినార్, మదీనా, ముర్గిచౌక్, మొఘుల్‌పుర కమాన్ మార్గాల్లో ఎలాంటి వాహనాలనూ అనుమతించబోమని తెలిపారు. ప్రధాన పాయింట్ల వద్ద ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందన్నారు.

సౌత్‌జోన్...

  • నయాపూల్ నుంచి చార్మినార్‌కు వెళ్లే వాహనాలను మదీనా వద్ద మళ్లించి సిటీ కాలేజీ మీదుగా అనుమతిస్తారు.
  • నాగుల్‌చింత, శాలిబండ నుంచి ట్రాఫిక్‌ను హిమ్మత్‌పురా జంక్షన్ వద్ద మళ్లించి హరిబౌలీ, వోల్గా హోటల్ మీదుగా మళ్లిస్తారు.
  • కోట్ల అలీజా నుంచి చార్మినార్‌కు వెళ్లే వాహనాలను బీబీ బజార్ వద్ద మళ్లిస్తారు.
  • పేట్లబుర్జు మూసాబౌలీ నుంచి చార్మినార్‌కు వెళ్లే ట్రాఫిక్‌ను మోతీగల్లీ నుంచి మళ్లించి ఖల్వత్ మీదుగా అనుమతిస్తారు.
  • ఎతేబార్ చౌక్ నుంచి వచ్చే వాహనాలను అక్కడే మళ్లించి మీరాలంమండి మార్కెట్, లేదంటే బీబీ బజార్ మీదుగా పంపిస్తారు.
  • మిట్టి కా షేర్ నుంచి వచ్చే వాహనాలను గుల్జార్ హౌస్‌కు వెళ్లనివ్వరు. ఘన్సీబజార్ వద్ద మళ్లిస్తారు.
  • ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను లక్కడ్ కోట్ (పాత సీపీ కార్యాలయ జంక్షన్) వద్ద మళ్లించి మీరాలంమండి మార్కెట్ మీదుగా అనుమతిస్తారు.
  • ఖిల్వత్ మైదానం నుంచి వచ్చే వాహనాలను పంచమొహల్లా లేన్‌లో అనుమతించరు. చౌమహల్లా ప్యాలెస్ బస్టాప్ వద్ద మళ్లించి ఖిల్వత్ గ్రౌండ్స్, మోతీగల్లీ టీ-జంక్షన్ మీదుగా ట్రాఫిక్‌ను అనుమతిస్తారు.


నార్త్‌జోన్...

  • ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సికింద్రాబాద్‌లోని సుభాష్ రోడ్డు (మహంకాళి పోలీసు స్టేషన్, ఎంజీ రోడ్డులోని రాంగోపాల్‌పేట రోడ్డు జంక్షన్)లో ఏ వాహనాన్ని అనుమతించరు. రోచా బజార్ నుంచి రాణిగంజ్ వరకు వాహనాలను అనుమతి ఉంటుంది.
  • బాటా ఎక్స్ రోడ్డు నుంచి సుభాష్‌నగర్ వెళ్లే వాహనాలను మహంకాళి పోలీసుస్టేషన్ వద్ద మళ్లించి ఎడమలేన్ మీదుగా లాలాగుడి మీదుగా అనుమతిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement