ప్రార్థనలకు ట్రాఫిక్ మళ్లింపు
సాక్షి, సిటీబ్యూరో: రంజాన్ నెల చివరి శుక్రవారమైన జుమా ఉల్ విదా ప్రార్థనల నేపథ్యంలో మక్కా మసీద్, సికింద్రాబాద్‌లోని జామే మసీద్‌లకు వెళ్లే రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు చార్మినార్, మదీనా, ముర్గిచౌక్, మొఘుల్పుర కమాన్ మార్గాల్లో ఎలాంటి వాహనాలనూ అనుమతించబోమని తెలిపారు. ప్రధాన పాయింట్ల వద్ద ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందన్నారు.
సౌత్‌జోన్...
నయాపూల్ నుంచి చార్మినార్‌కు వెళ్లే వాహనాలను మదీనా వద్ద మళ్లించి సిటీ కాలేజీ మీదుగా అనుమతిస్తారు.
నాగుల్చింత, శాలిబండ నుంచి ట్రాఫిక్‌ను హిమ్మత్‌పురా జంక్షన్ వద్ద మళ్లించి హరిబౌలీ, వోల్గా హోటల్ మీదుగా మళ్లిస్తారు.
కోట్ల అలీజా నుంచి చార్మినార్‌కు వెళ్లే వాహనాలను బీబీ బజార్ వద్ద మళ్లిస్తారు.
పేట్లబుర్జు మూసాబౌలీ నుంచి చార్మినార్‌కు వెళ్లే ట్రాఫిక్‌ను మోతీగల్లీ నుంచి మళ్లించి ఖల్వత్ మీదుగా అనుమతిస్తారు.
ఎతేబార్ చౌక్ నుంచి వచ్చే వాహనాలను అక్కడే మళ్లించి మీరాలంమండి మార్కెట్, లేదంటే బీబీ బజార్ మీదుగా పంపిస్తారు.
మిట్టి కా షేర్ నుంచి వచ్చే వాహనాలను గుల్జార్ హౌస్‌కు వెళ్లనివ్వరు. ఘన్సీబజార్ వద్ద మళ్లిస్తారు.
ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను లక్కడ్ కోట్ (పాత సీపీ కార్యాలయ జంక్షన్) వద్ద మళ్లించి మీరాలంమండి మార్కెట్ మీదుగా అనుమతిస్తారు.
ఖిల్వత్ మైదానం నుంచి వచ్చే వాహనాలను పంచమొహల్లా లేన్‌లో అనుమతించరు. చౌమహల్లా ప్యాలెస్ బస్టాప్ వద్ద మళ్లించి ఖిల్వత్ గ్రౌండ్స్, మోతీగల్లీ టీ-జంక్షన్ మీదుగా ట్రాఫిక్‌ను అనుమతిస్తారు.
నార్త్‌జోన్...
ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సికింద్రాబాద్‌లోని సుభాష్ రోడ్డు (మహంకాళి పోలీసు స్టేషన్, ఎంజీ రోడ్డులోని రాంగోపాల్‌పేట రోడ్డు జంక్షన్)లో ఏ వాహనాన్ని అనుమతించరు. రోచా బజార్ నుంచి రాణిగంజ్ వరకు వాహనాలను అనుమతి ఉంటుంది.
బాటా ఎక్స్ రోడ్డు నుంచి సుభాష్‌నగర్ వెళ్లే వాహనాలను మహంకాళి పోలీసుస్టేషన్ వద్ద మళ్లించి ఎడమలేన్ మీదుగా లాలాగుడి మీదుగా అనుమతిస్తారు.