ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా విశాఖపట్నంలో గురువారం నాడు ట్రాఫిక్ ఆంక్షలు అమలుచేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా విశాఖపట్నంలో గురువారం నాడు ట్రాఫిక్ ఆంక్షలు అమలుచేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 9 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని విశాఖ అదనపు డీసీపీ మహేంద్రపాత్రుడు తెలిపారు. షీలానగర్ నుంచి ఎన్‌ఏడీ-తాటిచెట్లపాలెం, గురుద్వార- మద్దెలపాలెం మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. ఎన్‌ఏడీ నుంచి సింహాచలం వైపు రాకపోకలపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కాన్వెంట్ జంక్షన్, షీలానగర్ అయ్యప్పస్వామి టెంపుల్ మీదుగా గాజువాక, స్టీల్ ప్లాంట్ వైపు వెళ్లే వాహనాలు పోర్ట్ కనెక్టివిటీ రోడ్డు మీదుగా రాకపోకలు సాగించాలని మహేంద్రపాత్రుడు చెప్పారు.
శ్రీకాకుళం వైపు వెళ్లే వాహనాలు లంకెలపాలెం, సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా మాత్రమే రాకపోకలు సాగించాలి. సిటీ- ఎయిర్‌పోర్ట్ - సిటీ రాకపోకలు సాగించేవారంతా ఇండస్ట్రియల్ బైపాస్ రోడ్డు ఉపయోగించుకోవాలని తెలిపారు. సెవెన్ హిల్స్ నుంచి ఏయూ పరిసర ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని విశాఖ అదనపు డీసీపీ మహేంద్రపాత్రుడు చెప్పారు.