
హైటెక్ సిటీకి దీటుగా మధురవాడ అభివృద్ధి: బాబు
హైటెక్ సిటీకన్నా అద్భుతంగా విశాఖపట్నంలోని మధురవాడ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. మధురవాడ ఐటీ సెజ్లోని హిల్ నెంబర్ 3లో ఇంక్యుబేషన్ సెంటర్ను ఆయన సోమవారం ప్రారంభించారు. తూర్పుకోస్తా ప్రాంతంలోనే విశాఖపట్నం మంచి నగరమని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ శరవేగంగా డిజిటల్ ఆంధ్రప్రదేశ్గా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఐటీ కంపెనీలకు విశాఖపట్నం అనువైనదని, ప్రధాని మోడీ మేక్ ఇన్ ఇండియా అన్నట్లుగానే తాము మేక్ ఇన్ ఏపీ అన్నది లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. విశాఖపట్నాన్ని సిలికాన్ కారిడార్గా అభివృద్ధి చేస్తామని, గూగుల్ అభివృద్ధి చెందినట్లు గానే ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేవారు. డ్వాక్రా సంఘాలకు కూడా ఐటీ పరిజ్ఞానాన్ని విస్తరిస్తామని తెలిపారు.