I-T hub
-
మొదట కొనేది ఇల్లే.. ఆ తర్వాతే పెళ్లి, ఫ్యూచర్
చదువు పూర్తయ్యిందా.. మంచి ఉద్యోగం, తర్వాత పెళ్లి, పిల్లలు, రిటైర్మెంట్ నాటికి ఓ సొంతిల్లు.. మన నాన్నల ఆలోచనలివే కదూ! కానీ, ప్రస్తుత తరం ఆలోచనలు, అభిరుచులూ మారాయి. చదువు కొనసాగుతుండగానే ఉద్యోగావకాశాలు నడిచొస్తున్నాయి. దీంతో యువత ముందుగా స్థిరమైన నివాసానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ తర్వాతే పెళ్లి, విదేశీ ప్రయాణాలు, ఫ్యూచర్ ఇతరత్రా వాటి కోసం ప్లానింగ్ చేస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరోవిరివిగా రుణాల లభ్యత, బహుళ ఆదాయ మార్గాలు, మంచి ప్యాకేజీతో స్థిరమైన ఉద్యోగ అవకాశాలు ఉండటంతో స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు యువత ఆసక్తి చూపిస్తోంది. 2018లో గృహ కొనుగోలుదారుల్లో మిలీనియల్స్ (25–35 ఏళ్ల వయస్సు గలవారు) వాటా 28 శాతంగా ఉండగా.. గతేడాదికి 37 శాతానికి పెరిగింది. 2030 నాటికి 60 శాతానికి చేరుతుందని జేఎల్ఎల్ ఇండియా అంచనా వేసింది.ఇటీవల కాలంలో దేశీయ స్థిరాస్తి రంగంలో సరికొత్త మార్పులు వచ్చాయి. గతంలో రిటైర్డ్, సీనియర్ సిటీజన్స్, సంపన్న వర్గాల గృహ కొనుగోళ్లు, పెట్టుబడులు ఉండేవి. కానీ, కొన్నేళ్లుగా మిలీనియల్స్, జెన్–జెడ్ కస్టమర్ల వాటా పెరిగింది. జీవితం ప్రారంభ దశలోనే దీర్ఘకాలిక పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. తొలి కారు, డిజైనర్ హ్యాండ్ బ్యాగ్‌లాగే ప్రాపర్టీకి నేటి యువత ప్రాధాన్యత ఇస్తోంది. అందుబాటులో టెక్నాలజీ.. మ్యాజిక్‌బ్రిక్స్.కామ్, హౌసింగ్.కామ్, 99 ఎకర్స్ వంటి రియల్ ఎస్టేట్ యాప్స్ యువ కొనుగోలుదారుల ప్రాపర్టీ శోధనను మరింత సులువు చేశాయి. గతంలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలంటే భౌతికంగా వెళ్లి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించడం, పరిసర ప్రాంతాల వాకబు వంటివి పెద్ద ప్రయాస ఉండేది. కానీ, నేటి యువతరానికి అంత టైం లేదు. దుస్తులు, ఫుడ్ ఆర్డర్ చేసినంత సులువుగా ప్రాపర్టీ కొనుగోళ్లు జరిగిపోవాలని కోరుకుంటున్నారు. వీరి అభిరుచికి తగ్గట్టు ప్రాపర్టీ సమీక్ష, రేటింగ్ యాప్స్, త్రీడీ వ్యూ, వర్చువల్ టూర్ వంటి సాంకేతికత పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాయి. గృహ రుణాలకు పోటీ.. యువ గృహ కొనుగోలుదారులకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సైతం పోటీపడి హోమ్లోన్స్ అందిస్తున్నాయి. రుణాల మంజూరులో వేగం, తక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. క్రౌడ్ ఫండింగ్, ప్రాపర్టీ షేరింగ్ వంటి పాక్షిక యాజమాన్య ప్లాట్‌ఫామ్‌లు పరిమిత మూలధనంతో స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు అవకాశాలు కల్పిస్తున్నాయి. దీంతో భారీ ముందస్తు చెల్లింపులు అవసరం లేకుండానే నేటి యువ కస్టమర్లు లక్ష కంటే తక్కువ ప్రారంభ పెట్టుబడితో యువ ఇన్వెస్టర్లు ఖరీదైన, విలాసవంతమైన ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నారు. ఐటీ హబ్‌లలో యువ పెట్టుబడులు.. బెంగళూరు, హైదరాబాద్ వంటి ఐటీ హబ్‌లలో యువ ఐటీ ఉద్యోగులు రియల్ ఎస్టేట్ మార్కెట్లో గణనీయమైన ప్రభావం చూపుతున్నారు. రూ.80 లక్షల నుంచి రూ.కోటి మధ్య ధర కలిగిన 2 బీహెచ్‌కే అపార్ట్మెంట్ల కొనుగోళ్లలో వీరి ప్రాధాన్యత అధికంగా ఉంది. కరోనాతో అలవాటైన వర్క్ ఫ్రం హోమ్‌తో యువ ఉద్యోగులకు నిత్యం ఆఫీస్‌కు వెళ్లాలనే టెన్షన్ లేదు. దీంతో ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో ఇళ్లు ఉండాలనుకోవడం లేదు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు @సేల్!మెరుగైన రవాణా సౌకర్యాలు ఉంటే సిటీకి కాస్త దూరమైనా సరే ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పైగా ప్రధాన ప్రాంతంలో కొనుగోలు చేసే ధరతోనే శివార్లలో పెద్ద సైజు ఇళ్లు, వసతులను పొందవచ్చనేది వారి అభిప్రాయం. అయితే గ్రీనరీతో పాటు విద్యుత్, నీటి వినియోగాన్ని ఆదా చేసే ప్రాజెక్ట్‌లు, సౌర ఫలకాలు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వంటి పర్యావరణ అనుకూల ఫీచర్లు ఉండే ఇళ్లను కోరుకుంటున్నారు.పెరిగిన పట్టణ గృహ యజమానులు.. కరోనాతో అలవాటైన వర్క్ ఫ్రం హోమ్ విధానంతో యువ ఉద్యోగులు ఆఫీసులో కూర్చొని పనిచేసే అవసరం లేదు. వారు ఇప్పుడు తమ పనికి కాకుండా జీవనశైలికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో వారికి నచ్చిన ప్రాంతంలో నివసించే స్వేచ్ఛ కోరుకుంటున్నారు. వేగవంతమైన పట్టణీకరణ, సాంకేతిక ఆవిష్కరణలు, వినియోగదారుల అభిరుచులతో గృహ కొనుగోలుదారుల్లో మార్పులు వచ్చాయి.ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు కీలకమైన వృద్ధి కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. 2020లో పట్టణ గృహ యజమానుల రేటు 65 శాతంగా ఉండగా.. 2025 నాటికి 72 శాతానికి పెరుగుతుందని జేఎల్ఎల్ అంచనా వేసింది. సరసమైన గృహ రుణాలు, నివాస సముదాయంలో యువ కొనుగోలుదారుల ప్రాధాన్యతే ఈ వృద్ధికి ప్రధాన కారణాలు. -
హైటెక్ సిటీకి దీటుగా మధురవాడ: బాబు
-
హైటెక్ సిటీకి దీటుగా మధురవాడ అభివృద్ధి: బాబు
హైటెక్ సిటీకన్నా అద్భుతంగా విశాఖపట్నంలోని మధురవాడ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. మధురవాడ ఐటీ సెజ్‌లోని హిల్ నెంబర్ 3లో ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఆయన సోమవారం ప్రారంభించారు. తూర్పుకోస్తా ప్రాంతంలోనే విశాఖపట్నం మంచి నగరమని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ శరవేగంగా డిజిటల్ ఆంధ్రప్రదేశ్‌గా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఐటీ కంపెనీలకు విశాఖపట్నం అనువైనదని, ప్రధాని మోడీ మేక్ ఇన్ ఇండియా అన్నట్లుగానే తాము మేక్ ఇన్ ఏపీ అన్నది లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. విశాఖపట్నాన్ని సిలికాన్ కారిడార్‌గా అభివృద్ధి చేస్తామని, గూగుల్ అభివృద్ధి చెందినట్లు గానే ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేవారు. డ్వాక్రా సంఘాలకు కూడా ఐటీ పరిజ్ఞానాన్ని విస్తరిస్తామని తెలిపారు. -
ఐటీ రాజధాని హైదరాబాద్
ఐటీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్‌కు కేంద్రం ఆమోదం హైదరాబాద్ చుట్టూ 50 వేల ఎకరాల్లో ఐటీఐఆర్ ఐటీ, ఐటీఈఎస్, ఎలక్ట్రానిక్, హార్డ్‌వేర్ సంస్థల సమ్మేళనం ఎస్ఈజెడ్లు, ఇండస్ట్రియల్ పార్కులు, ఫ్రీట్రేడ్ జోన్లు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో పెట్టుబడులు సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: రాష్ట్ర రాజధానికి తలమానికంగా మరో ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. ఇప్పటికే దేశంలో ఐటీ రంగంలో అగ్రశ్రేణిలో ఉన్న హైదరాబాద్ తాజాగా ఐటీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) రూపంలో మరింత ప్రఖ్యాతిగాంచనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ప్రాజెక్టుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ ఆమోదం తెలిపింది. మొత్తం 202 చదరపు కిలోమీటర్ల పరిధిలో, 50 వేల ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయ తలపెట్టిన ఐటీఐఆర్‌లో దాదాపు రూ. 2,19,440 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేశారు. ఇందులో ఐటీ, ఐటీ ఆధారిత సేవల (ఐటీఈఎస్) సంస్థల ఏర్పాటుకు రూ. 1.18 లక్షల కోట్లు, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ తయారీ సంస్థల ఏర్పాటుకు 1.01 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రధానంగా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో పెట్టుబడులు ఉంటాయి. ప్రత్యక్షంగా 15 లక్షల మందికి ఉద్యోగాలు, పరోక్షంగా 56 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందని అంచనా. ఐటీఐఆర్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు క్లస్టర్లలో 202 చదరపు కిలోమీటర్ల భూమిని కేటాయించింది. సైబరాబాద్ డెవలప్మెంట్ ఏరియా, దాని పరిసరాల్లో ఒక క్లస్టర్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ ఏరియా, మహేశ్వరంలో మరో క్లస్టర్, ఉప్పల్, పోచారం ఏరియాలో ఇంకో క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు తొలి దశను 2013 నుంచి 2018 వరకూ అమలు చేస్తారు. రెండో దశ అమలు 2018 నుంచి 2038 వరకూ ఉంటుంది. ఉత్పత్తి యూనిట్లు, ప్రజావసరాలు, పర్యావరణ పరిరక్షణకు అవసరమైన యంత్రాంగం, నివాస ప్రాంతం, పరిపాలన సేవలు అన్నీ ఐటీఐఆర్‌లో భాగమై ఉంటాయి. స్పెషల్ ఎకానమిక్ జోన్ (ఎస్ఈజెడ్)లు, ఇండస్ట్రియల్ పార్కులు, ఫ్రీ ట్రేడ్ జోన్లు, వేర్‌హౌసింగ్ జోన్లు, ఎగుమతులకు సంబంధించిన యూనిట్లు, అభివృద్ధి కేంద్రాలు ఇందులో భాగంగా ఉంటాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య శుక్రవారం సచివాలయంలో ఈ విషయం మీడియాకు వెల్లడించారు. ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసులు, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ సంస్థల ఏర్పాటుకు అవసరమైన సమీకృత నాలెడ్జి క్లస్టర్లు ఏర్పాటుచేయాలని, ఇందుకు రాష్ట్రాలు ప్రతిపాదనలు పంపాలని కేంద్ర ప్రభుత్వం 2008 మే 29న విధానపర నిర్ణయంలో భాగంగా గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించి కేంద్రానికి పంపింది. దీనికి కేంద్ర కేబినెట్ కమిటీ తాజాగా ఆమోదం తెలిపిన నేపధ్యంలో.. కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశాఖ, పట్టణాభివృద్ధి శాఖ, రైల్వే మంత్రిత్వశాఖలు ఈ ప్రాజెక్టు అమలుపై సవివరమైన అధ్యయనం, చర్యలు ప్రారంభించనున్నాయి. ఐటీఐఆర్ వల్ల లబ్ధి ఇలా... - ప్రత్యక్ష రెవెన్యూ: రూ. 3,10,849 కోట్లు - ఐటీ పెట్టుబడుల సామర్థ్యం: రూ. 2,19,440 కోట్లు - ఐటీ ఎగుమతులు: రూ. 2,35,000 కోట్లు - ప్రత్యక్షంగా ఉద్యోగాలు: 14.8 లక్షల మందికి - పరోక్షంగా ఉపాధి: 55.9 లక్షల మందికి - రాష్ట్రానికి అదనంగా లభించే పన్ను ఆదాయం: రూ. 30,170 కోట్లు స్వరూపం ఇదీ... - మొత్తం 202 చదరపు కిలోమీటర్ల (50 వేల ఎకరాలు) పరిధిలో ఏర్పాటు - 25 ఏళ్లలో (2013 నుంచి 2038 వరకూ) రెండు దశల్లో మూడు క్లస్టర్లుగా ఐటీఐఆర్ ఏర్పాటు - సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ (గచ్చిబౌలి, మాదాపూర్ ఏరియాల్లో) పరిధిలో - హైదరాబాద్ ఎయిర్‌పోర్టు డెవలప్మెంట్ అథారిటీ (మామిడిపల్లి, రావిర్యాల, ఆదిభట్ల, మహేశ్వరం) పరిధిలో - ఉప్పల్, పోచారం పరిధిలో మరొక క్లస్టర్ - ఈ మూడు క్లస్టర్లను అనుసంధానిస్తూ మొత్తం 202 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఐటీఐఆర్ విస్తరిస్తుంది మూడు క్లస్టర్ల విస్తీర్ణం... 1. హెచ్ఎండీఏ (సైబరాబాద్ ఏరియా పరిసరాలు): 86.7 చదరపు కిలోమీటర్లు 2. హెచ్ఎండీఏ (ఎయిర్‌పోర్టు ఏరియా): 79.2 చదరపు కిలోమీటర్లు 3. ఉప్పల్, పోచారం: 10.3 చదరపు కిలోమీటర్లు కనెక్టివిటీలో భాగంగా - ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్ఆర్) గ్రోత్ కారిడార్ 1: 11.5 చ.కి.మీ. - ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) గ్రోత్ కారిడార్ 2: 14.3 చ.కి.మీ