సాక్షి, సంగారెడ్డి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సంగారెడ్డిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రేపు నగరంలో ట్రాఫిక్ విధించారు పోలీసులు. పటాన్‌చెరులో బీజేపీ విజయ సంకల్ప బహిరంగ సభ నేపథ్యంలో ఉదయం ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఉదయం 9:50 నుంచి 10:15 మధ్య రాజ్‌భవన్ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టు మార్గంలో ఆంక్షలు ఉంటాయన్నారు.
సభా స్థలికి ఐదుకిలో మీటర్ల మేరకు యాంటీ డ్రోన్స్ నిబంధన విధించనున్నారు. మూడంచెల భద్రతతో రెండు వేల మంది పోలీస్ సిబ్బందితో భద్రతా చర్యలు చేపట్టారు.సభా స్థలికి వచ్చే వారు ఎలాంటి వస్తువులు తీసుకురావద్దని పోలీసులు పేర్కొన్నారు. కేవలం మొబైల్స్ మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. క్యూ ఆర్ కోడ్ ద్వారా పార్కింగ్ రూట్ మ్యాప్ ఏర్పాటు చేశారు.
చదవండి: ‘ఎన్టీఆర్‌కే ఒడిదుడుకులు తప్పలేదు.. మనమెంత?’
ప్రధాని మోదీ సంగారెడ్డి జిల్లా పర్యటన వివరాలు
- 10 గంటలకు పటాన్‌చెరు చేరుకోనున్న ప్రధాని మోదీ.
- 10:40కి పటేల్‌గూడలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ
- 11:20 నిమిషాలకు పటేల్ గూడలో బీజేపీ విజయ సంకల్ప బహిరంగ సభలో పాల్గొననున్న మోదీ.
- పటాన్ చెరులో ప్రధాని పర్యటనకు చకచక సాగుతున్న ఏర్పాట్లు.
- పటేల్ గూడలోని SR ఇన్ఫినిటీలో ప్రధాని బహిరంగ సభ.
- సంగారెడ్డి వేదికగా రూ. 9021 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను వర్చువల్‌గా చేయనున్న ప్రధాని మోదీ.
- సంగారెడ్డి జిల్లా కేంద్రంగా రూ. 1409 కోట్లతో నిర్మించిన NH-161 నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ.
- సంగారెడ్డి X రోడ్డు నుంచి మదీనగూడ వరకు 1298 కోట్లతో NH-65ని ఆరు లేన్లుగా విస్తరించే పనులకు ప్రధాని శంకుస్థాపన.
- మెదక్ జిల్లాలో రూ.399 కోట్లతో చేపడుతున్న NH 765D మెదక్- ఎల్లారెడ్డి హైవే విస్తరణ, 500 కోట్లతో ఎల్లారెడ్డి- రుద్రూర్ విస్తరణ పనులకు శంకుస్థాపన.
Comments
Please login to add a commentAdd a comment