రేపు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో : బక్రీద్ పండుగ సందర్భంగా పాతబస్తీ మీరాలం ఈద్గా, సికింద్రాబాద్ బాలమ్‌రాయ్ ఈద్గా వద్ద శుక్రవారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు సిటీ పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
మీరాలం ఈద్గాకు వచ్చే వారి వాహనాలను ఉదయం 8 నుంచి 9.30 వరకు పురానాపూల్, కామాటిపుర, కిషన్‌బాగ్, బహదూర్‌పుర ఎక్స్ రోడ్డుల మీదుగా అనుమతిస్తారు.
సాధారణ ట్రాఫిక్‌ను మీరాలం ఈద్గా రోడ్డు వైపు అనుమతించరు. బహదూర్‌పురా ఎక్స్ రోడ్డు వద్ద ట్రాఫిక్ మళ్లించి కిషన్‌బాగ్, లేదంటే కామాటిపుర మీదుగా ప్రార్థనలు ముగిసేవరకు (ఉదయం 8 నుంచి 11 గంటల వరకు) పంపిస్తారు.
ప్రార్థనల కోసం మీరాలం ఈద్గాకు వచ్చే వాహనాలను శివరామ్‌పల్లి, ఎన్‌పీఏ నుంచి ఉదయం 9.30 వరకూ అనుమతిస్తారు.
బహదూర్‌పుర ఎక్స్ రోడ్డుకు వెళ్లే సాధారణ వాహనాలను ధనమ్మ హట్స్ టీ జంక్షన్ వద్ద మళ్లించి అలియాబాద్, అన్సారీ రోడ్డు, జహనుమా బాయ్స్ టౌన్ స్కూల్ వరకు పంపిస్తారు.
ఈద్గా వరకు సైకిల్ రిక్షాలు, సైకిల్స్‌ను అనుమతించరు. బహిరంగ ప్రాంతాల్లోని స్టాండ్స్‌లో సైకిళ్లను పార్క్ చేయాలి.
పురానాపూల్ నుంచి శివ టెంపుల్‌కు వెళ్లే సాధారణ ట్రాఫిక్‌ను సిటీ కాలేజీ వద్ద మళ్లిస్తారు.
బాలమ్‌రాయి ఈద్గా..
సీటీఓ నుంచి సికింద్రాబాద్‌లోని బాలమ్‌రాయ్ ఈద్గా సమీపంలోని క్లాసిక్ గార్డెన్ రోడ్డు వైపు వాహనాలను అనుమతించరు. రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద మళ్లించి లీ రాయల్ ప్యాలెస్ జంక్షన్, బాలమ్‌రాయ్ చెక్ పోస్టు మీదుగా పంపిస్తారు.
అన్నానగర్ నుంచి వచ్చే సాధారణ ట్రాఫిక్‌ను క్లాసిక్ గార్డెన్, ఈద్గా మీదుగా అనుమతించరు. బాలమ్‌రాయ్ చెక్ పోస్టు మీదుగా అనుమతిస్తారు. ఉదయం తొమ్మిది నుంచి 11.30 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.