Commissioner mahendarreddy
-
హృదయం పదిలం..
ఖైరతాబాద్: మెరుగైన జీవనం గడిపేందుకు ప్రతీ ఒక్కరు జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకోవాలని, నిత్యం వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా గురువారం నెక్లెస్‌రోడ్డులో కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్ఐ) ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ తీశారు. దీనిని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో సీఎస్ఐ తెలంగాణ చాప్టర్ అధ్యక్షుడు శ్రీధర్ కస్తూరి, డాక్టర్ వై.వి.సుబ్బారెడ్డి, డాక్టర్ గణేష్, డాక్టర్ రమేష్, డాక్టర్ రమాకుమారి, విద్యార్థులు పాల్గొన్నారు. -
రేపు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో : బక్రీద్ పండుగ సందర్భంగా పాతబస్తీ మీరాలం ఈద్గా, సికింద్రాబాద్ బాలమ్రాయ్ ఈద్గా వద్ద శుక్రవారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు సిటీ పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మీరాలం ఈద్గాకు వచ్చే వారి వాహనాలను ఉదయం 8 నుంచి 9.30 వరకు పురానాపూల్, కామాటిపుర, కిషన్‌బాగ్, బహదూర్‌పుర ఎక్స్ రోడ్డుల మీదుగా అనుమతిస్తారు. సాధారణ ట్రాఫిక్‌ను మీరాలం ఈద్గా రోడ్డు వైపు అనుమతించరు. బహదూర్‌పురా ఎక్స్ రోడ్డు వద్ద ట్రాఫిక్ మళ్లించి కిషన్‌బాగ్, లేదంటే కామాటిపుర మీదుగా ప్రార్థనలు ముగిసేవరకు (ఉదయం 8 నుంచి 11 గంటల వరకు) పంపిస్తారు. ప్రార్థనల కోసం మీరాలం ఈద్గాకు వచ్చే వాహనాలను శివరామ్‌పల్లి, ఎన్పీఏ నుంచి ఉదయం 9.30 వరకూ అనుమతిస్తారు. బహదూర్‌పుర ఎక్స్ రోడ్డుకు వెళ్లే సాధారణ వాహనాలను ధనమ్మ హట్స్ టీ జంక్షన్ వద్ద మళ్లించి అలియాబాద్, అన్సారీ రోడ్డు, జహనుమా బాయ్స్ టౌన్ స్కూల్ వరకు పంపిస్తారు. ఈద్గా వరకు సైకిల్ రిక్షాలు, సైకిల్స్‌ను అనుమతించరు. బహిరంగ ప్రాంతాల్లోని స్టాండ్స్‌లో సైకిళ్లను పార్క్ చేయాలి. పురానాపూల్ నుంచి శివ టెంపుల్‌కు వెళ్లే సాధారణ ట్రాఫిక్‌ను సిటీ కాలేజీ వద్ద మళ్లిస్తారు. బాలమ్రాయి ఈద్గా.. సీటీఓ నుంచి సికింద్రాబాద్‌లోని బాలమ్రాయ్ ఈద్గా సమీపంలోని క్లాసిక్ గార్డెన్ రోడ్డు వైపు వాహనాలను అనుమతించరు. రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద మళ్లించి లీ రాయల్ ప్యాలెస్ జంక్షన్, బాలమ్రాయ్ చెక్ పోస్టు మీదుగా పంపిస్తారు. అన్నానగర్ నుంచి వచ్చే సాధారణ ట్రాఫిక్‌ను క్లాసిక్ గార్డెన్, ఈద్గా మీదుగా అనుమతించరు. బాలమ్రాయ్ చెక్ పోస్టు మీదుగా అనుమతిస్తారు. ఉదయం తొమ్మిది నుంచి 11.30 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. -
డేగకన్ను నిఘా
గణేశ్ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు కమిషనర్ మహేందర్‌రెడ్డి సాక్షి, సిటీబ్యూరో : నగరంలో గణేశ్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు డేగకన్ను నిఘా, భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి చెప్పారు. బషీర్‌బాగ్‌లోని హైదరాబాద్ పోలీసు కమిషనర్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెలలోనే గణేశ్ ఉత్సవాలు, బక్రీద్‌తో పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గణేశ్ ఉత్సవాల బందోబస్తు కోసం 20 వేల మంది సిబ్బం దిని సిద్ధం చేశామన్నారు. నగరంలోని 12 వేల మంది పోలీసులతో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు ఎనిమిది వేల మంది వరకు ఫోర్స్‌ను తెప్పిస్తున్నామన్నారు. 120 పెట్రోలింగ్ వాహనాలు, 17 ఇంటర్ సెప్టర్లు, 30 బాంబు నిర్వీర్య బృం దాలు, 30 స్నిప్పర్ డాగ్స్ 12 రోజులు పాటు 24 గంటలూ పని చేస్తాయని కమిషనర్ తెలిపారు. గణేశ్ నిమజ్జనాల కోసం హుస్సేన్‌సాగర్ వద్ద 88 మొబైల్ క్రేన్స్, ఘాట్ల దగ్గర 50 క్రేన్లు పని చేస్తాయన్నారు. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ప్రత్యేక టీంలు పని చేస్తాయన్నారు. ఈనెల 25న బక్రీద్ సందర్భంగా ప్రార్థనలు జరిగే ఈద్గాల వద్ద కూడా ప్రత్యేక బలగాలు భద్రతను ఏర్పా టు చేస్తామని మహేందర్‌రెడ్డి చెప్పారు. 400 సీసీటీవీ కెమెరాలు... బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు 400కు పైగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వీటి కమిషరేట్‌లోని కంట్రోల్ కమాండ్ సెంటర్‌కు అనుసంధానం చేశామని కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. నిమజ్జనానికి గణేశ్ విగ్రహాలతో బయలుదేరిన వాహనాలు ఎక్కడున్నాయి? ట్రాఫిక్ ఎలా ఉంది. ఏమైనా అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయా కంట్రోల్ కమాండ్ సెంటర్ నుంచి పర్యవేక్షించి అధికారులు ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీ చేస్తారని కమిషనర్ చెప్పారు. సమావేశంలో లా అండ్ అర్డర్ ఏసీపీ అంజనీకుమార్, ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ జితేందర్ , క్రైమ్స్ అండ్ సిట్ అదనపు పోలీసు కమిషనర్ స్వాతిలక్రా, స్పెషల్ బ్రాంచ్ అడిషనల్ సీపీ నాగిరెడ్డి పాల్గొన్నారు. ప్రశాంతంగా జరుపుకోండి సాక్షి, సిటీబ్యూరో: గణేశ్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కోరారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనర్ లో గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. వినాయక చవితి వేడుకల్లో ఎలాంటి అపశ్రుతి దొర్లకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమావేశంలో జాయింట్ సీపీ టీవీ శశిధర్ రెడ్డి, మాదాపూర్ జోన్ డీసీపీ కార్తికేయ, అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు, గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.