డేగకన్ను నిఘా | Eagle Eye Surveillance | Sakshi
Sakshi News home page

డేగకన్ను నిఘా

Published Thu, Sep 17 2015 3:12 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM

డేగకన్ను నిఘా - Sakshi

డేగకన్ను నిఘా

గణేశ్ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు
కమిషనర్ మహేందర్‌రెడ్డి

 
 సాక్షి, సిటీబ్యూరో : నగరంలో గణేశ్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు డేగకన్ను నిఘా, భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి చెప్పారు. బషీర్‌బాగ్‌లోని హైదరాబాద్ పోలీసు కమిషనర్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెలలోనే గణేశ్ ఉత్సవాలు, బక్రీద్‌తో పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గణేశ్ ఉత్సవాల బందోబస్తు కోసం 20 వేల మంది సిబ్బం దిని సిద్ధం చేశామన్నారు.

నగరంలోని 12 వేల మంది పోలీసులతో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి  దాదాపు ఎనిమిది వేల మంది వరకు ఫోర్స్‌ను తెప్పిస్తున్నామన్నారు. 120 పెట్రోలింగ్ వాహనాలు, 17 ఇంటర్ సెప్టర్‌లు, 30 బాంబు నిర్వీర్య బృం దాలు, 30 స్నిప్పర్ డాగ్స్ 12 రోజులు పాటు 24 గంటలూ పని చేస్తాయని కమిషనర్ తెలిపారు.  గణేశ్ నిమజ్జనాల కోసం హుస్సేన్‌సాగర్ వద్ద 88 మొబైల్ క్రేన్స్, ఘాట్‌ల దగ్గర 50 క్రేన్‌లు పని చేస్తాయన్నారు. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ప్రత్యేక టీంలు పని చేస్తాయన్నారు. ఈనెల 25న బక్రీద్ సందర్భంగా ప్రార్థనలు జరిగే ఈద్గాల వద్ద కూడా ప్రత్యేక బలగాలు భద్రతను ఏర్పా టు చేస్తామని  మహేందర్‌రెడ్డి చెప్పారు.

 400 సీసీటీవీ కెమెరాలు...
 బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు 400కు పైగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వీటి కమిషరేట్‌లోని కంట్రోల్ కమాండ్ సెంటర్‌కు అనుసంధానం చేశామని కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. నిమజ్జనానికి గణేశ్ విగ్రహాలతో బయలుదేరిన వాహనాలు ఎక్కడున్నాయి? ట్రాఫిక్ ఎలా ఉంది. ఏమైనా అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయా కంట్రోల్ కమాండ్ సెంటర్ నుంచి పర్యవేక్షించి అధికారులు ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీ చేస్తారని కమిషనర్ చెప్పారు.  సమావేశంలో లా అండ్ అర్డర్ ఏసీపీ అంజనీకుమార్, ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ జితేందర్ ,  క్రైమ్స్ అండ్ సిట్ అదనపు పోలీసు కమిషనర్ స్వాతిలక్రా, స్పెషల్ బ్రాంచ్ అడిషనల్ సీపీ నాగిరెడ్డి పాల్గొన్నారు.
 
 ప్రశాంతంగా జరుపుకోండి
 సాక్షి, సిటీబ్యూరో: గణేశ్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కోరారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనర్ లో గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. వినాయక చవితి వేడుకల్లో ఎలాంటి అపశ్రుతి దొర్లకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమావేశంలో జాయింట్ సీపీ టీవీ శశిధర్ రెడ్డి, మాదాపూర్ జోన్ డీసీపీ కార్తికేయ, అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు, గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement