
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు
సిటీబ్యూరో: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పర్యటన నేపథ్యంలో శనివారం ఉదయం 10.45 నుంచి 11.45 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం–హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ మధ్య ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ అదనపు సీపీ జితేందర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా మార్గాల్లో ట్రాఫిక్‌ను పూర్తిగా ఆపడం, లేదా దారి మళ్ళించడం చేస్తామన్నారు.
రాష్ట్రపతి నిలయం–ఈఎంఈ సెంటర్ హౌస్–ఆరెస్‌సై జంక్షన్–ఆంధ్రా సబ్–ఏరియా ఆఫీసర్స్ మెస్–నేవీ హౌస్ జంక్షన్–బిసిన్ బేకరీ ఎక్స్‌టెన్షన్ కౌంటర్–యాప్రాల్ రోడ్–బిసిన్ హెడ్–క్వార్టర్స్ మెయిన్ గేట్–బిసిన్ ఎన్వైర్‌మెంటల్ పార్క్–హైగ్ లైన్ పంప్ హౌస్–ఫస్ట్ బెటాలియన్ ఈఎంఈ సెంటర్–బొల్లారం చెక్‌పోస్ట్–జేసీఓస్ మెస్ ఈఎంఈ సెంటర్–షహెజ్ ద్వార్–బొల్లారం చెక్‌పోస్ట్–ఎయిర్‌ఫోర్స్ 2 అండ్ 4 బెటాలియన్ గేట్–హకీంపేట ఎయిర్‌పోర్స్ స్టేషన్ ప్రాంతాల్లోని వాహనచోదకులు దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు.