ట్రాఫిక్‌ మళ్లింపు | - | Sakshi

ట్రాఫిక్‌ మళ్లింపు

Mar 7 2024 5:35 AM | Updated on Mar 7 2024 7:35 AM

- - Sakshi

సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి మండలం పిసినికాడలో సీఎం బహిరంగ సభ నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్టు ఎస్పీ మురళీకృష్ణ పేర్కొన్నారు. భారీ వాహనాలు, కంటైనర్లు, టిప్పర్లు, లారీలు మొదలైన వాహనాలను దారి మళ్లిస్తున్నామని చెప్పారు. గురువారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ఆంక్షలు ఉంటాయన్నారు.

► విశాఖ నుంచి తుని వైపు జాతీయ రహదారి మీదుగా వెళ్లే వాహనాలు లంకెలపాలెం జంక్షన్‌, పరవాడ, అచ్యుతాపురం, యలమంచిలి, రేగుపాలెం జంక్షన్‌ జాతీయ రహదారి మీదుగా తుని చేరుకోవాలి.

► తుని నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే వాహనాలు తుని, రేగుపాలెం జంక్షన్‌, యలమంచిలి బైపాస్‌, అచ్యుతాపురం, పరవాడ, లంకెలపాలెం జంక్షన్‌ జాతీయ రహదారి మీదుగా విశాఖ చేరుకోవాలి.

► సబ్బవరం జాతీయ రహదారి మీదుగా వచ్చే వాహనాలు అనకాపల్లి, లంకెలపాలెం జంక్షన్‌, పరవాడ, అచ్యుతాపురం, యలమంచిలి బైపాస్‌, రేగుపాలెం జంక్షన్‌ జాతీయ రహదారి మీదుగా తుని వైపు వెళ్లవచ్చు

► చోడవరం నుంచి తుని వైపు వెళ్లే వాహనాలు అనకాపల్లి బ్రిడ్జి, మునగపాక, పూడిమడక రోడ్డు, అచ్యుతాపురం జంక్షన్‌, యలమంచిలి బైపాస్‌, రేగుపాలెం జంక్షన్‌ జాతీయ రహదారి మీదుగా తుని చేరుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement